కరోనా ఎఫెక్ట్ : వెలవెలబోతున్న తిరుమల.. చేసేదేమి లేక ఫ్రీగా లడ్డూలు...

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా జనసాంద్రత ఎక్కడికక్కడే స్తంభించిపోయింది.అంతేకాక ఇప్పటికే పలు సంస్థల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా ఇంటి నుంచి పని చేయడానికి అధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు.

 Ttd Officials Thinking About To Give Free Laddu To The Employees-TeluguStop.com

అయితే ఈ ప్రక్రియను దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి.అయితే పాఠశాలలకు కూడా ఈ నెల ఆఖరు వరకూ పూర్తిగా సెలవులు ఇచ్చేశారు.

అయితే తాజాగా ఈ కరోనా వైరస్ ప్రభావం నిత్యం భక్తులతో రద్దీగా ఉండేటువంటి ఎంతో ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పై కూడా పడింది.దీంతో ఇప్పటికే టిటిడి దేవస్థానం అధికారులు ఈ ఆలయాన్ని కొంతకాలం పాటు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ విషయం దేవస్థాన ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.అయితే తిరుపతిలో ప్రసాదంగా పంచి పెట్టే లడ్డు ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ బాగా తెలుసు.

Telugu Laddu Employees, Ttd, Ttdofficials-Latest News - Telugu

అయితే ఈ కరోనా వైరస్ కారణంగా ఆలయం మూతపడడంతో భక్తులకు పంచి పెట్టడం కోసం తయారు  చేసినటువంటి లడ్డూలు దాదాపుగా లక్షల సంఖ్యలో మిగిలిపోయాయి.దీంతో ఆలయ అధికారులు ఈ లడ్డూలను ఉగాది పండుగ కానుకగా భక్తులకు పంచి పెట్టాలని చూసినప్పటికీ ఆలయం ఇప్పటికె పూర్తిగా మూత పడటంతో ఈ లడ్డూలను టీటీడీలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు పంచి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతున్న ఎటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తానికి మూతపడటం ఇది చరిత్రలోనే రెండో సారి.ఈ విషయం పై పలువురు స్పందిస్తూ అప్పట్లో శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు జరుగుతోందని తొందర్లోనే కలియుగం అంతం అవుతుందని, అందుకు ఇలాంటి సూచనలు నిదర్శనం అంటున్నారు.

  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube