కొత్త నిబంధనలు తీసుకువచ్చిన టీటీడీ..!

తిరుమలలో కొలువై ఉన్న ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి విదేశాల నుంచి సైతం ప్రజలు వస్తూ ఉంటారు.ఒక్కసారి శ్రీవారి దర్శనం చేసుకుంటే చాలు సకల దోషాలు తొలగిపోయి సుఖ శాంతులతో జీవిస్తామని భక్తులు భావిస్తారు.

 Ttd New Rules About Darshanam Timings, Ttd,thirupathi Devotees, Key Decision,  2-TeluguStop.com

అయితే తిరుపతి తిరుమల దేవస్థానం వారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రోజుకో కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు.ఈ నిబంధనల వల్ల శ్రీవారి భక్తులు కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇప్పుడు కొత్తగా అలిపిరి నడక మార్గంలో ఉదయం 9 గంటల తరువాత రేపటి రోజు దర్శనం టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ వాళ్ళు స్వామివారి దర్శన భాగ్యానికి అనుమతిస్తున్నారు.


అలాగే రేపటి రోజున శ్రీవారి దర్శనం టికెట్లు ఉండి వాహనాలలో పైకి వెళ్లే భక్తులను కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రమే టీటీడీ అనుమతిస్తోంది.

టీటీడీ తీసుకున్నా ఈ నిర్ణయం పట్ల ఎవరికి ముందస్తు సమాచారం లేదు.ఈ సమాచారం తెలియక అలిపిరి వద్ద భారీగా భక్తులు పోటెత్తుతున్నారు.ఈ నేపథ్యంలో అక్కడ భక్తులను అదుపు చేయలేక అక్కడ విజిలెన్స్ సిబ్బంది సైతం చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.అక్కడ భక్తులు మాత్రం టీటీడీ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇలా భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుందని అంటున్నారు.ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అలిపిరి దగ్గర భారీగా జనాలు గుమిగూడి ఉన్నారు.

అలాగే ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.గంటల కొద్ది వేచి చూడలిసిన పరిస్థితి నెలకొంది.

ఒక పక్క జనాలు గుమిగూడిన చోట కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంది.ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో టీటీడీ ఈ దర్శన సమయానికి 24 గంటలు ముందు అనుమతించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube