పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!  

Ttd Lord Venkateswara Blessings For Newly-weds By Post-

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది.ఈ పథకం వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడాన్ని మరింత సులభ సాధ్యం చేస్తోంది.

Ttd Lord Venkateswara Blessings For Newly-weds By Post--TTD Lord Venkateswara Blessings For Newly-weds By Post-

శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

”మాంగళ్యం తంతునానేన, మామ జీవన హేతునా |

శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపనుంది.

వధూవరులు కల్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేస్తారు.ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ వీటిని ధరింపజేస్తారు.ఇందుకు ప్రతీకగా.శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని పంపుతారు.నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ.శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపడం జరుగుతుంది.వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలిపేందుకు టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య రచించిన ‘కల్యాణ సంస్కృతి’ పేరిట ఓ పుస్తకాన్ని, టీటీడీ ఈవో పేరిట వేద ఆశీర్వచనం పత్రికను కొత్త జంటలకు పంపుతారు.ఇవి కనీసం ఒక పది వేల మందికి పంపించాలి అని టీటీడీ నిర్ణయించుకుంది.

అంతేకగా, భక్తులు పూర్తి చిరునామాతో ఈ కింద ఉన్న చిరునమాకి శుభలేఖ పంపితే చాలు మీకు శ్రీవారి కల్యాణ తలంబ్రాలు ఇంటికి వస్తాయి ,

అడ్రస్ ::

ఎగ్జిక్యూటివ్ అధికారి,

మరిన్ని వివరాలకు కాల్‌ సెంటరును 0877- 2233333, 2277777 ఫోన్లలో సంప్రదించాలని టీటీడీ సూచించింది.

ముఖ్యమైన విషయం : మీ అడ్రస్ కూడా తప్పనిసరిగా రాసి పంపించండి , తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంపేవి మీకు చేరడానికి కొంచం సమయం పట్టవచ్చు గమనించగలరు