కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.లక్ష కేసులు దాటి మరీ నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్దం అవుతుంది.

 Ttd Halt Sarva Darshanam Tokens Due To Corona-TeluguStop.com

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.రాబోయే నాలుగు వారాల పాటు మరింత కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రతి ఒక్క రాష్ట్రం కూడా సిద్దంగా ఉండాలని ఈ సందర్బంగా కేంద్రం ప్రకటన చేసింది.ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

 Ttd Halt Sarva Darshanam Tokens Due To Corona-కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీటీడీ సర్వదర్శనంకు సంబంధించిన టికెట్లు అన్నింటిని కూడా నిలిపి వేయడం జరిగింది.సర్వదర్శణం టికెట్ల కారణంగా క్యూ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున జనాలు ఉండాల్సి వస్తుంది.

అందుకే సర్వ దర్శణంకు సంబంధించిన టికెట్లను పూర్తిగా నిలిపేయడం జరిగింది.కేవలం ఆన్‌ లైన్‌ ద్వారా 300 రూపాయల తో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు మాత్రమే దైవ దర్శణంకు అర్హులు అంటూ టీటీడీ ప్రకటించింది.

మళ్లీ సర్వదర్శణం టికెట్లు ఎప్పుడు ఇచ్చే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

#Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు