తిరుమల వెళ్లే భక్తులు ఇది కంపల్సరీ..!

కరోనా సెకండ్ వేవ్ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతుంది.ఈ క్రమంలో అక్కడకి వచ్చే వారి గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Ttd Eo Jawahar Reddy Requested Devotees Visits Tirupati Temple , Covid Vaccine C-TeluguStop.com

కంపల్సరీగా రెండు వ్యాక్సిన్లు తీసుకున్న సర్టిఫికెట్ చూపించాలని.లేదా మూడు రోజుల క్రితం కరోనా టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలని టిటిడి బోర్డ్ ప్రకటించింది.

శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాలని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.

రెండు వ్యాక్సిన్ లు వేయించుకోని వారు మూడు రోజుల క్రితం టెస్ట్ చేయించుకుని నెగటివ్ వచ్చిన రిపోర్ట్ అయినా సరే చూపించాలని అన్నారు.

క 18 ఏళ్ల లోపు పిల్లలకు కూడా కొవిడ్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలని అన్నారు.టీటీడీ ధర్మకర్తల మండలి సభ్య కార్యదర్శిగా ఈవో జవహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ విధానం అమలు చేస్తారని తెలిపారు.అయితే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఈ నిబంధనల నుండి సడలింపు ఇస్తున్నట్టు తెలిపారు.

వారు ఆధార్ కార్డ్ తెస్తే సరిపోతుందని అన్నారు.శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుండి 15 వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

అందుకు సంబందించిన ఏర్పాట్లను ఆయన అధికారులు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube