ఇళ్ల నిర్మాణం పేరుతో టీటీడీ ఉద్యోగులు అక్రమ రుణాలు.. 49 మందికి షోకాజ్ నోటీసులు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పరిధిలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నాట్లు  నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రూ.కోట్ల లో రుణాలు పొందునట్లు ఆడిట్ లో బయటపడింది.

 Ttd Employees Illegal Loans Over Construction Of Houses Showcase Notices For 49 Members-TeluguStop.com

సోమవారం వెలుగుచూసిన ఈ వ్యవహారంలో టీటీడీలో అటెండర్ స్థాయి నుంచి డిప్యూటీ స్థాయి ఈవో వరకు ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.దీనిపై స్పందించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి 49 ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

నోటీసులు అందుకున్న ఉద్యోగులు వివరణ పై తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ నిబంధనల మేరకు టీటీడీ లో ఉద్యోగి క్యాడర్ మేరకు హౌస్ బిల్డింగ్ లోన్ ఇస్తారు.వేతనం ఆధారంగా అటెండర్ స్థాయి ఉద్యోగికి రూ.10 లక్షలు సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రూ.12.5 లక్షలు సూపర్డెంట్ కి రూ.15 లక్షలు లక్షలు, ఏఇఓ ఆపై స్థాయి అధికారులకు రూ.20 లక్షల వరకు రుణం ఇస్తారు.అయితే బిల్డింగ్ కట్టకుండానే తప్పుడు పత్రాలు చూపించి లోన్ తీసుకున్న ఘటనలు వెలుగుచూడటంతో ఐదు సంవత్సరాల క్రితమే విజిలెన్స్ ఎంక్వైరీకి  అప్పటి ఈవో సాంబశివరావు ఆదేశించారు.

 Ttd Employees Illegal Loans Over Construction Of Houses Showcase Notices For 49 Members-ఇళ్ల నిర్మాణం పేరుతో టీటీడీ ఉద్యోగులు అక్రమ రుణాలు.. 49 మందికి షోకాజ్ నోటీసులు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu 49 Members, Construction Of Houses, Illegal Loans, Showcase Notices, Tirumala Tirupati Devasthanam, Ttd Employees, Ttd Eo Jawahar Reddy-Latest News - Telugu

2 సంవత్సరాల క్రితం విజిలెన్స్ నివేదిక సమర్పించినప్పటికీ చర్యలు మాత్రం వాయిదా పడుతూనే వచ్చాయి.ఇటీవలే వరుసగా అక్రమాలకు పాల్పడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో చర్చలు తీసుకుంటున్న ఈవో జవహర్ రెడ్డి గత ఆరు నెలల కాలంలో 23 మంది ఉద్యోగులను సర్వీస్ నుండి డిస్మిస్ చేశారు.మరికొందరు కొంతమంది పై క్రమశిక్షణ చర్యలుతో  సరిపెట్టిన ఈవో తాజాగా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.

#ConstructionOf #TtdEo #49 Members #Illegal Loans #TTD Employees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు