కలికాలం : తిరుమలేశుడికి కూడా కరోనా ఎఫెక్ట్...

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది.  ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై దెబ్బ పడింది.

 Ttd Committee Taking Sensational Decision For Coronavirus Effect-TeluguStop.com

దీంతో గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవి చూస్తున్నాయి.అంతేగాక కొన్ని పరిశ్రమ రంగాలు మరియు సాప్ట్ వేర్ కంపెనీలు ఇప్పటికే తమ సంస్థలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.

అలాగే మరికొన్ని కంపెనీలు అయితే ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి.అయితే తాజాగా ఈ కరోనా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పై కూడా పడినట్లు తెలుస్తోంది.

ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల తాజాగా టిటిడి దేవస్థానం ఆలయ నిర్వాహకులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇందులో భాగంగా కాలినడకన వచ్చేటువంటి భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండా నేరుగా దర్శనం జరిగేలా తగు చర్యలు తీసుకోనున్నారు.

అంతేకాక ఈ కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు ఈ నెల 19వ తారీకు నుంచి 21వ తారీకు వరకు ధన్వంతరి మహా యాగం కూడా నిర్వహించ నున్నారు.అలాగే సీతారాముల కళ్యాణ వేడుకను కూడా ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతి లేకుండా లైవ్ లో వీక్షించేందుకు పలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Tirupati, Tirupati Ttd, Ttdcommittee-Latest News - Telugu

అయితే ఇటీవలే తిరుపతిలో కరోనా వైరస్సోకిందంటూ తైవాన్ కి చెందినటువంటి ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు.అయితే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించగా అతడికి ఎటువంటి కరోనా వైరస్ ఒక లేదని నిర్ధారణ కావడంతో ఆలయ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube