తిరుమలలో లాఠీ చార్జి పై టి‌టి‌డి క్లారిటీ

ఏపీ టి‌డి‌పి ప్రతిపక్షనేత చంద్రబాబు, జగన్ పై విమర్శలు చేశాడు.అధికారంలోకి వచ్చినప్పటి నుండి తిరుమల ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరిస్తోంది అన్నారు.

 Ttd Chairman Yv Subbareddy Give The Clarity About Lathicharge In Piligrims, Ttd-TeluguStop.com

రెండు వేల మంది వైసీపీ నాయకులు తిరుమల కొండపైకి చేరుకొని రాజకీయ ఊరేగింపులు చేస్తూ డ్రోన్స్ ఎగరవేస్తూ ఉంటే పోలీసులు ఏమిచేస్తున్నారని ప్రశ్నించాడు.ప్రశాంత వాతావరణంలో జరగవలిసిన తిరుమల శ్రీవారి దైవ దర్శనంను ఏర్పాట్లు చెయ్యడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.

తిరుమల కొండపైన పోలీసులు భక్తులపై లాఠీఛార్జి చేయడం హేయం అన్నారు.

ఈ విషయంపై టీటీడీ చైర్మెన్ వై వి సుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో స్పందించాడు.

శ్రీ వారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై ఎక్కడ కూడా లాఠీఛార్జి జరగలేదని ఇది కేవలం ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు చేసిన ఆరోపణ మాత్రమే అన్నాడు.ఈ నేపథ్యంలోనే శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వస్తున్న భక్తులకు అన్నీ ఏర్పాట్లు టీటీడీ చేసిందని అన్నారు.

తిరుమల కొండపై రాజకీయాలు చెయ్యడం ఇష్టంలేదని చెప్పాడు.అన్నమయ్య ప్రవేశించిన మార్గాన్నిఅభివృద్ది చేసే విషయంపై టీటీడీ ఆలోచిస్తుందని అన్నారు.అలిపిరి వద్ద భక్తులపై పోలీసుల లాఠీఛార్జి జరగలేదని ఆయన స్పష్టం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube