అర్చకులకు కరోనా,టీటీడీ చైర్మన్ అత్యవసర సమావేశం!

టీటీడీ లో మరోసారి కరోనా భయం మొదలైంది.ఇప్పటికే టీటీడీ లో పలువురు అర్చకులకు కొంత మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

 Ttd Chairman Yv Subba Reddy Emergency Meeting With Archakas, Ttd Chairman Yv Sub-TeluguStop.com

దీనితో మొత్తం గా 14 మంది టీటీడీ అర్చకులకు కరోనా సోకినట్లు ప్రధాన అర్చకులు తెలిపినట్లు సమాచారం.దీనితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అర్చకులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది.

రోజు రోజుకు టీటీడీలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ కరోనాపై చర్యలకు ఉపక్రమించింది.

అర్చకుల శ్రేయస్సే ముఖ్యమని తెలిపిన టీటీడీ చైర్మన్ అర్చకులతో సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది.

వయసుతో సంబంధం లేకుండా 25 ఏళ్ల వయసు గల వారికి కూడా ఈ కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 60 ఏళ్ల పైబడిన అర్చకులు కొద్దీ రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి అంటూ టీటీడీ చైర్మన్ సూచించినట్లు తెలుస్తుంది.

అయితే 14 మంది అర్చకులకు కరోనా సోకిందని, అయితే భక్తుల వల్ల ఇది వ్యాపించలేదని అర్చకులు చెబుతున్నారు.

అయితే ఏది ఏమైనా అర్చకుల శ్రేయస్సే ముఖ్యమన్న టీటీడీ చైర్మన్ వయసు పై బడిన వారు కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకోవాలి అంటూ సూచించారు.

ఇప్పటికే 60 ఏళ్లు పై బడిన వారిని బస్సులు ఎక్కడానికి అనుమతించడం లేని సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అర్చకుల విషయంలో కూడా చైర్మన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube