శ్రీవారి దర్శనాల విషయంలో టీటీడీ కీలక ప్రకటన..!!

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి ఘాట్ రోడ్ లో.కొండ చరియలు విరిగి పడటంతో.

 Ttd Chairman Sensatational Decision On Darshans Details, Ttd, Yv Subha Reddy, P-TeluguStop.com

రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం.

శ్రీవారిని దర్శించుకోవడానికి ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారు.దర్శన సమయాన్ని వారం రోజులు వాయిదా వేసుకోవాలని తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది.

ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.అంతే కాకుండా దర్శనం కోసం బుక్ చేసుకున్న టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు హామీ ఇచ్చారు.

దర్శనం టికెట్లు ఉన్నవారు వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించారు.

ఈ క్రమంలో తిరుపతి ఘాట్ రోడ్డు లో విరిగిపడిన కొండచరియల ప్రాంతాన్ని.

వై.వి సుబ్బారెడ్డి పరిశీలించారు.గత 20 సంవత్సరాలలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురియడంతో.కొండచరియలు విరిగిపడ్డాయి అని పేర్కొన్నారు.అంతేకాకుండా త్వరలోనే రహదారుల మరమ్మతు కార్యక్రమాన్ని చేపట్టి అతి త్వరగా కంప్లీట్ చేయడానికి.ఢిల్లీ నుండి ఐఐటీ నిపుణుల బృందాన్ని పిలిపుస్తున్నామని స్పష్టం చేశారు.

రహదారుల పునరుద్ధరణకు మరో మూడు రోజులు టైం పడుతుంది అని అందువల్లే దర్శనం వాయిదా వేసుకోవాలని సూచించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube