స్టార్‌ హీరోల తండ్రిపై కేసు నమోదు

తమిళ స్టార్‌ హీరోలు అయిన సూర్య, కార్తిల తండ్రి శివ కుమార్‌ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద విషయంలో మీడియాలో ఉంటూనే ఉంటాడు.ఆ మద్య ఒక అభిమానిని కొట్టడం, ఆ తర్వాత మరో అభిమాని ఫోన్‌ పగుల గొట్టడం వంటివి చేయడంతో విమర్శల పాలు అయిన శివ కుమార్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.

 Shiva Kumar, Surya And Karthi Father, Ttd, Tirumala, Tamil-TeluguStop.com

ఈ సారి ఏకంగా కాస్త సీరియస్‌గానే అయ్యేలా ఉంది.పోలీసు కేసు వరకు వెళ్లడంతో శివ కుమార్‌ విషయంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల నటుడు అయిన శివ కుమార్‌ ఒక సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యమత ప్రార్థనలు ప్రచారాల గురించి వివాదాస్పదంగా మాట్లాడాడు.టీటీడీ పై విమర్శలు చేశాడు.

అన్యమత ప్రచారం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.టీటీడీ పరువుకు భంగం కలిగించేలా ఆయన మాట్లాడాడు అంటూ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

Telugu Shiva Kumar, Surya Karthi, Tamil, Tirumala-

శివ కుమార్‌ తప్పుడు ఆరోపణలు చేసి పవిత్ర తిరుమల దేవస్థానం పవిత్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించాడని టీటీడీ అధికారులు అన్నారు.అసలు ఏ విషయంను బట్టి ఆయన అలాంటి విమర్శలు చేశారో తమకు అర్థం కావడం లేదని, ఆయన పబ్లిసిటీ కోసం ఈ పని చేసి ఉంటాడేమో అంటూ మరికొందరు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube