టీటీడీ ఆడిట్ ను కాగ్ నిర్వహించాలి : పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 Ap, Ttd, Audit, Cag, Governing Body-TeluguStop.com

అయితే 2014-20 వరకు స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ జరిపినా దీనిపై కూడా కాగ్ ఆడిటింగ్ చేయాలని టీటీడీ పాలక మండలి ప్రభుత్వాన్ని విన్నవించింది.

టీటీడీ ఆడిటింగ్ కు సంబంధించి 2014-20 వరకు ప్రతి ఏడాది రాష్ట్ర ఆడిట్ ద్వారా డబ్బు లెక్కింపు జరుగుతోంది.

కానీ ఆడిటింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి.దీంతో ఆడిటింగ్ ను కాగ్ ద్వారా నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది.

ఈ మేరకు కాగ్ ద్వారా ఆడిటింగ్ జరపాలని టీటీడీ పాలకమండలి అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు ఎంపీ సుబ్రమణ్య స్వామి టీటీడీ నిర్ణయంపై స్పందించారు.

కాగ్ ఆధ్వర్యంలో ఆడిటింగ్ చేయించాలన్నది మంచి నిర్ణయమన్నారు.టీటీడీ నిర్ణయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు సమ్మతించారన్నారు.

అవినీతిపై ఉక్కుపాదం మోయడానికి ఇప్పటికే సీఎం జగన్ పలు చర్యలు తీసుకుంటున్నారని, త్వరలో దిశ తరహాలో అవినీతిని నియంత్రించడానికి చట్టం తీసుకోస్తున్నారని తెలిపారు.ఈ విషయాన్ని ఎంపీ తన ట్వీటర్ ఖాతాలో వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube