ఎస్వీబీసీ ఛైర్మెన్‌ పదవికి పృథ్వీ రాజీనామా... రాసలీలల ఎఫెక్ట్  

Ttd Asks Prudhvi To Resign For Svbc Chairman Post-ap Politics,resign For Svbc Chairman Post,ttd Asks Prudhvi,ysrcp

కమెడియన్, ఎస్వీబీసీ భక్తి చానల్ చైర్మన్ పృధ్వీ రాసలీలల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అమరావతి రాజధాని రైతుల మీద విమర్శలు చేసిన తర్వాత పృద్వీకి సంబందించిన ఆడియో టేపులు ఊహించని విధంగా భక్తి చానల్ ఉద్యోగ సంఘాల నుంచి బయటకి వచ్చింది.

Ttd Asks Prudhvi To Resign For Svbc Chairman Post-ap Politics,resign For Svbc Chairman Post,ttd Asks Prudhvi,ysrcp తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ-TTD Asks Prudhvi To Resign For SVBC Chairman Post-Ap Politics Resign Svbc Post Ttd Ysrcp

ఇక ఈ వీడియోలో ఓ మహిళా ఉద్యోగితో పృద్వీ రాసలీలల సంభాషణ సంచలనంగా మారడంతో మీడియా ఉదయం నుంచి రచ్చ చేస్తూనే ఉంది.కెమెరామెన్ తో రాంబాబు సినిమాలో చెప్పినట్లు ఈ రోజు మీడియాకి పృద్వీ ఐటెంగా దొరికాడు.

దీంతో ఒకటే రచ్చ చేసాయి.

ఇక ఈ వ్యవహారం ముదిరి పాకాన పడటంతో అధికార పార్టీ ఉపశమన చర్యలు మొదలెట్టింది.

అతని వలన పార్టీ మీద విమర్శలు వస్తాయని వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చెప్పడం జరిగినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఓ వైపు విజిలెన్స్ ని విచారణకి ఆదేశించిన సుబ్బారెడ్డి పృధ్వీని ఉన్నపళంగా రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో భక్తి చానల్ చైర్మన్ పదవికి అతను రాజీనామా చేసినట్లు సమాచారం.ఇక తదుపరి క్రమశిక్షణ చర్యలు ఆరోపణలు రుజువు అయిన తర్వాత తీసుకోవడం జరుగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు.

.

తాజా వార్తలు