సునామీ రాబోతోందా? కన్యాకుమారిలో జరిగిన ఈ ఘటనే సంకేతమా?

కన్యాకుమారిలోని సముద్రంలో ఏర్పడిన మార్పులకు సునామీ రాబోతోందా అన్న ఆందోళన కలిగిస్తున్నాయి.సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల సముద్రం కొద్దిగా ముందుకు కదలడంలాంటివి గమనిస్తూ ఉంటాం.

 Tsunami Symptoms At Kanyakumari, Tsunami, Floods, Incident In Kanyakumari, Hindu-TeluguStop.com

దీని ప్రభావం అధికమైతే సునామీ వంటివి వస్తాయని మనకు తెలిసిన విషయమే.సునామీ వస్తే ఎవరూ ఊహించని విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది.

కన్యాకుమారిలో గత రెండు రోజుల నుంచి సముద్రంలో జరుగుతున్న హెచ్చుతగ్గులు దేనికి సంకేతం? ఆ ప్రాంతంలో సునామీ రాబోతోందా? ఇలాంటి భయాందోళనక ఆలోచనలతో తీర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు.
హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం వంటి మూడు మహాసముద్రాలు కలిసే ఈ కన్యాకుమారిని త్రికడలి సంగమం అని పిలుస్తారు.

అయితే కన్యాకుమారి ఈ ప్రాంతంలో గత రెండు రోజులుగా సముద్రం లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి.సముద్రంలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉండటం వల్ల తీర ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

గురువారం రాత్రి సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లి రాత్రంతా అదే విధంగా ఉంది శుక్రవారం ఉదయం కల్లా యథాస్థానంలోకి వచ్చింది.మరి శుక్రవారం రాత్రి ఇదే ఘటన చోటు చేసుకోవడం వల్ల సముద్ర తీరం లో ఉన్నటువంటి వివేకానంద మండపంలో, తిరువళ్ళువర్ విగ్రహం వద్ద రాళ్లు గుట్టలుగా కనిపించడం వల్ల అందరిలో తెలియని అలజడి మొదలయ్యింది.2004వ సంవత్సరంలో సునామీ రావడానికి మందు ఇలాంటి ఘటన చోటు చేసుకుందని అక్కడి జాలరులు ఆ చేదు గతాన్ని గుర్తు చేసుకున్నారు.కానీ నిపుణులు మాత్రం ప్రతి అమావాస్య, పౌర్ణమిలలో సముద్రంలో ఇలాంటి మార్పులు సంభవించడం తరచూ సర్వసాధారణమైనని చెబుతున్నారు.

సముద్రంలో ఇలా మార్పులు చోటు చేసుకోవడం వల్ల సునామి వంటి అతి భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కో వలసిన పరిస్థితి వస్తుందేమోనని అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube