డిప్యూటీ స్పీకర్ పైనే శివసేన చూపు  

Shivasena Party Is Waiting For Deputy Speaker Post In Lok Sabha-

లోక్ సభ స్పీకర్ గా ఇటీవల బీజేపీ ఎంపీ రాజస్థాన్ నేత ఓం బిర్లా ఎన్నికైన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎవ్వరు అన్న విషయం పై ఇంకా తర్జన భర్జన పడుతున్నారు.డిప్యూటీ స్పీకర్ ఎవరికీ ఇవ్వాలి అని బీజేపీ వ్యూహాలు రచిస్తుంది...

Shivasena Party Is Waiting For Deputy Speaker Post In Lok Sabha--Shivasena Party Is Waiting For Deputy Speaker Post In Lok Sabha-

వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ పదవి అనేది విపక్ష పార్టీలకు ఇవ్వడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ.ఈ లెక్కన ఇప్పుడా పదవి ఏ పార్టీ ఖాతాలోకి వెళుతుందో అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.మరోపక్క ఈ పదవి ని తమ పార్టీ ఎంపీ కె కట్టబెట్టాలని శివసేన భావిస్తుంది.

ఈ నేపథ్యంలో ఒకరి పేరును కూడా ఆ పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.శివసేన తో పాటు నవీన్ పట్నాయక్,అలానే నితీష్ కుమార్ యాదవ్ పార్టీలు కూడా రేస్ లో ఉన్నాయి.అయితే దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ గా ఉన్న ఏపీ ప్రభువైసీపీ పార్టీ కి ఆ అవకాశం ఉంది.

Shivasena Party Is Waiting For Deputy Speaker Post In Lok Sabha--Shivasena Party Is Waiting For Deputy Speaker Post In Lok Sabha-

అయితే ప్రత్యేక హోదా పై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించనిదే ఆ పదవిని స్వీకరించేందుకు జగన్ సర్కార్ సిద్ధంగా లేదు అన్నట్లు తెలుస్తుంది.దీనితో ఇప్పుడు ఒకవేళ ఈ డిప్యూటీ పోస్ట్ నుంచి వైసీపీ గనుక తప్పుకుంటే ఆ ఛాన్స్ శివసేన వదులుకోకూడదు అని భావిస్తుంది.దీనితో ఇప్పుడు డిప్యూటీ పోస్ట్ ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠత ఇంకా కొనసాగుతూనే ఉంది.