పాక్ లో భారీ పేలుడు గాయపడ్డ మసూద్ అజార్

పొరుగుదేశం పాకిస్థాన్ లో భారీ పేలుడు సంభవించింది.అయితే ఈ ఘటనలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

 Tstop2masood Azhar Injured In Military Hospital In Rawalpindi-TeluguStop.com

పాకిస్థాన్ లోని రావల్పిండి లోని మిలిటరీ ఆసుపత్రిలో ఈ భారీ పేలుడు సంభవించింది అంటూ పాక్ నెటిజన్లు సోషల్ మీడియా లో వీడియో లు పెట్టారు.అయితే ఈ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ కూడా అయ్యాయి.

రావల్పిండి లోని మిలిటరీ ఆసుపత్రిలో పేలుడు సంభవించింది అని ఆ ప్రాంతానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త ఆసానుల్లా అనే వ్యక్తి ఒక ట్వీట్ చేశారు.అక్కడ మిలిటరీ ఆసుపత్రిలో జరిగిన పేలుళ్ల లో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని,వారిలో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కూడా ఉన్నాడు అంటూ ట్వీట్ చేశారు.

మసూద్ గత కొద్దీ కాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు అంటూ పాక్ ఆర్మీ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇటీవల పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్ జైషే చీఫ్ పై అనుమానం వ్యక్తం చేయడం తో పాక్ అతడు గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారు అని,కనీసం ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నట్లు పాక్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు రావల్పిండి లోని మిలిటరీ ఆసుపత్రిలో పేలుడు ఘటన చోటుచేసుకుంది అని దానిలో గాయపడిన వారిలో మసూద్ అజార్ కూడా ఉన్నట్లు మానవ హక్కుల కార్యకర్త ట్వీట్ చేశారు.

అయితే ఈ పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారని, ఘటనాస్థలం వద్దకు వెళ్లడానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదని ఆసానుల్లా తెలిపారు.

అసానుల్లాతో పాటు మరికొందరు పాక్ నెటిజన్లు కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.అయితే దీనిపై పాక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.

అయితే ఈ పేలుడు ఘటన మొత్తం ప్రమాదం కాదని, ప్రణాళికా బద్ధంగా జరిగిన దాడేనంటూ కొందరు అంటున్నారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube