డేరా బాబా పెరోల్ విషయంలో హర్యానా ప్రభుత్వం అత్యుత్సాహం

అత్యాచార అభియోగాల నేపథ్యంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇటీవల వ్యవసాయం చేస్తాను అంటూ పెరోల్ ఇవ్వండి అని అధికారులను కోరిన సంగతి తెలిసిందే.అయితే డేరా బాబాను పెరోల్ పై బయటకు తీసుకువచ్చేందుకు హర్యానా ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది.

 Tstop2haryana Government Recommends For Ram Rahim Parole-TeluguStop.com

అయితే అసలు డేరా బాబా ను పెరోల్ పై బయటకు తీసుకురావడానికి హర్యానా ప్రభుత్వం ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది.మైనర్ల పై అత్యాచారం కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న గుర్మీత్ వ్యవసాయం చేయాలి నాకు పెరోల్ ఇవ్వండి అంటూ నెల క్రితమే హర్యానా హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

అయితే ఆ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం గుర్మిత్‌ బయటికొస్తే లా అండ్‌ ఆర్డర్‌ ప్రా బ్లెమ్స్‌ వస్తాయని పేర్కొంది.దీనితో వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా పెరోల్ ఇప్పించాలంటూ సిర్సా జైలు అధికారులకు డేరా బాబా దరఖాస్తు చేసుకున్నాడు.

అంతేకాకుండా జైలులో తన ప్రవర్తన కూడా సంతృప్తికరంగా ఉన్నందున తాను పెరోల్‌కు అర్హుడిని అంటూ ఆ దరఖాస్తు లో పేర్కొన్నాడు.జైలులోరామ్ రహీమ్‌ సింగ్ ప్రవర్తన మంచిగా ఉందని, ఏ నిబంధనలనూ అతిక్రమించ లేదని జైల్ సూపరింటెండెంట్.

కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

దీనితో ఆ రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి పాన్వార్ స్పందిస్తూ ఏడాది శిక్ష అనుభవించిన సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు పెరోల్ ఇచ్చే అవకాశం ఉందని, డేరా బాబా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ మాత్రం గుర్మీత్ విషయంలో హర్యానా ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అని,ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ అంటుంది.అయితే పాన్వార్ మాత్రం తమకు అలాంటి ఉద్దేశ్యం లేదని,ఒకవేళ అదే మా ఉద్దేశ్యం అయితే లోక్ సభ ఎన్నికల సమయంలోనే ఆయనను బయటకు తీసుకువచ్చేవాళ్ళం అని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube