రియాల్టీ షో లో ఆ ఇద్దరు లేడీ యాంకర్స్

ఇటీవల సినిమాలలో,సీరియల్స్ లో పాపులారిటీ సంపాదించక పోయినప్పటికీ రియాల్టీ షో లలో పాల్గొంటే మాత్రం ఎవరైనా పాపులారిటీ ఇట్టే సంపాదించేస్తారు.ఈ క్రమంలోనే అందరూ కూడా రియాల్టీ షో లపై పడ్డారు.

 Tstop2anchors Sri Mukhi And Lasya In Big Boss Reality Show-TeluguStop.com

ఒక ప్రసార మాధ్యమం లో వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.తొలుత బాలీవుడ్ లో సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ రియాల్టీ షో కు ఎంత పాపులారిటీ వచ్చిందో, తెలుగు లో కూడా ఈ రియాల్టీ షో కు అంతే పాపులారిటీ వచ్చింది అని చెప్పాలి.

ఈ సారి ఈ షో కు స్టార్ హీరో కింగ్ నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సారి ఈ రియాల్టీ షో కోసం ఎన్నుకొనే అభ్యర్థుల విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ సారి పాల్గొన బోయే పార్టిసిపెంట్స్ అందరూ కూడా దాదాపు సెలబ్రిటీలనే టాక్ వినిపిస్తుంది.

మొన్నటివరకు ఈ రియాల్టీ షో లో ప్రముఖ యాంకర్స్ అనసూయ,ఉదయ భాను లు పాల్గొననున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు లేడీ యాంకర్స్ ని ఈ షో కోసం తీసుకున్నట్లు తెలుస్తుంది.వారే శ్రీముఖి,లాస్య, వారిద్దరూ కూడా పలు టీవీ షో లలో యాంకర్స్ గా చేసి తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

వారి షో ల కారణంగా తెలుగు ప్రేక్షకులకు వారు బాగా దగ్గరయ్యారు.ఈ నేపథ్యంలో వారిద్దరిని కూడా ఈ బిగ్ బాస్ రియాల్టీ షో కోసం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube