విడ్డూరం : మంచి కోరి సలహా ఇస్తే రూ.10 కోట్ల ఫైన్‌ పడింది

మంచికి పోతే చెడు ఎదురయ్యిందని అంటూ ఉంటారు.ఇతరులకు మంచి చేయాలని ప్రయత్నిస్తే మనకు చెడు జరుగుతుంది.

 Tstop1wrong Suggestionsto Lottowinner-TeluguStop.com

ఉదాహరణకు రోడ్డుపై పడిపోయిన వారిని లేపేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని కాపాడి వీరు కిందపడిపోవడం లేదంటే గాయాలు తలిగించుకోవడం వంటివి చూస్తూ ఉంటాం.కొన్ని సందర్బాల్లో సాయం చేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం.ఇలాంటి సమయంలో ఒక నగర మేయర్‌ మంచికి పోతే రూ.10 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆస్ట్రేలియా పెర్త్‌లో షెరిన్‌ గిర్గిస్‌ అనే వ్యక్తి 2007వ సంవత్సరంలో లాటరీ లోట్టో ప్రైజ్‌ గెలిచాడు.అందులో భాగంగా అతడికి దాదాపుగా రూ.150 కోట్ల నగదు లభించింది.అంతకు ముందు వరకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట షెరిన్‌ లాటరీ రావడంతో ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు.అన్ని డబ్బులు అయితే వచ్చాయి కాని వాటిని ఎలా వాడాలి, ఎలాంటి వ్యాపారాలు చేయాలనే విషయంపై అతడికి అవగాహణ లేదు.

దాంతో ఎవరిని నమ్మాలో అర్థం కాక ఆ ప్రాంత మేయర్‌ను కలుసుకున్నాడు.

విడ్డూరం : మంచి కోరి సలహా ఇస్త�

మేయర్‌ రస్సెల్‌ పబ్బు, నైట్‌ క్లబ్‌, బోటు బిజినెస్‌లు చేయమని షెరిన్‌కు సలహా ఇచ్చాడు.మేయర్‌ సలహా మేరకు దాదాపు 100 కోట్ల మేరకు అందులో పెట్టుబడులు పెట్టాడు.అయితే అయిదు సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు కరిగి పోయాయి.

కనీసం పెట్టుబడి కూడా రాలేదు.దాంతో మళ్లీ షెరిన్‌ పరిస్థితి మొదటికి వచ్చింది.

తనకు ఇలాంటి పరిస్థితికి కారణం మేయర్‌ అంటూ కోర్టులో కేసు వేయడం జరిగింది.సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా మేయర్‌ చేసిన తప్పుకు రూ.10 కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగింది.

విడ్డూరం : మంచి కోరి సలహా ఇస్త�

తెలియకున్నా కూడా అవగాహణ లోపంతో సలహాలు ఇచ్చినందుకు గాను ఈ శిక్ష అంటూ కోర్టు తీర్పులో పేర్కొంది.కోర్టు తీర్పుకు మేయర్‌ నోరెళ్లబెట్టాడు.అతడు బాగు పడాలని సలహా ఇచ్చాను, అతడు సరిగా వ్యాపారాలు చేసుకోక పోవడంతో నష్టం వచ్చింది.

దానికి నేనేం చేయలంటూ కోర్టులో అతడు వాదనలు వినిపించాడు.మేయర్‌ వాదనలు పట్టించుకోని కోర్టు 10 కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube