ఒక్క ఐదు నిమిషాలు కరంట్ పోయి మనకు రోడ్డు మీద ఏమీ కనిపించకుంటే జీవితం ఏంటి ఇలా అయిపొయింది అని అనుకుంటాం.అలాంటిది ఇక ట్రాఫిక్ లో కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ పై రైడ్ చేస్తే ఇక అంతే.
చూసి డ్రైవ్ చేస్తేనే రోజుకో యాక్సిడెంట్ లు చోటుచేసుకుంటున్నాయి.అలాంటిది కళ్లకు గంతలు కట్టుకొని ఒక వ్యక్తి ట్రాఫిక్ లో బైక్ రైడ్ షో నిర్వహించాడు.
ఆటను ఎవరో కాదు ప్రముఖ మెజీషియన్ జూనియర్ జాదూగర్ ఆనంద్.ఆయన ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే కళ్లకు గంతలు కట్టుకొని ఈ బైక్ రైడ్ షో నిర్వహించాడు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్నగర ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జున రావు హాజరయ్యారు.ఆయన కళ్లకు గంతలు కట్టుకొని రద్దీ గా ఉండే రోడ్లపై బైక్ రైడ్ నిర్వహించడం తో జనాలు భారీ గా అక్కడకు చేరుకొని జూనియర్ జాదూ రైడ్ ను తెగ చూశారు.

నగరంలోని పురమందిరం నుంచి విఆర్సి, ఆర్టిసి, వేదయపాలెం, పొదలకూరు రోడ్డు, గాంధీ బొమ్మ మీదుగా తిరిగి టౌన్ హాల్ వరకు ఈ ప్రదర్శన సాగింది.కళ్ళకు గంతలు కట్టుకుని వాహనాలు జాగ్రత్తగా నడిపితే, అన్ని చూడగలిగిన వారు ఇంకా అప్రమత్తంగా నడపాలని ఈ రైడ్ ద్వారా జూనియర్ జాదూగర్ ప్రజలకు పిలుపు నిచ్చారు.
.