ప్రపంచ కప్ లో మరో రసవత్తర పోరు పాక్ బంగ్లా ల మధ్య పోటీ  

Pakistan Vs Bangladesh Match-

ఐసీసీ ప్రపంచ కప్ లో ఈ రోజు రసవత్తరమైన పోరు జరగనుంది.అదే మరి కొద్దీ సేపటిలో ప్రారంభం కానున్న పాకిస్థాన్,బంగ్లాదేశ్ మ్యాచ్.ఈ మ్యాచ్ లో గెలవడం తో బంగ్లా కు ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ ఆఖరి మ్యాచ్ లో విజయం తో ముగింపు పలకాలని భావిస్తుంది.మరోపక్క పాక్ కి మాత్రం ఈ మ్యాచ్ లో భారీ స్కోరు తో గనుక విజయం సాధిస్తే ఖచ్చితంగా సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

Pakistan Vs Bangladesh Match--Pakistan Vs Bangladesh Match-

అయితే కనీసం ఈ మ్యాచ్ లో బంగ్లా జట్టును 300 పైనే స్కొరు తో ఓడించాల్సి ఉంటుంది అన్నమాట.మరి అంత స్కోరు తేడా రావాలి అంటే పాక్ ఎంత స్కోర్ చేయాల్సి ఉంటుంది,బంగ్లా బ్యాట్స్ మేన్స్ ను ఎంత స్కోర్స్ లో అవుట్ చేయాల్సి ఉంటుంది.ఇదంతా కూడా ఇప్పుడు పాక్ కు తలనొప్పిగా మారింది.అయితే ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ ఆఖరి లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

పాక్ జట్టు లో ఫకర్ జమాన్‌ ఇమాముల్‌ హక్‌ బాబర్‌ అజామ్‌ మహ్మద్‌ హఫీజ్‌ హారిస్ సోహైల్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌) ఇమాద్‌ వసీం షాదాబ్‌ఖాన్‌ వాహబ్‌ రియాజ్‌ మహ్మద్‌ ఆమీర్‌ షాహీన్‌ అఫ్రిది.అలానే బంగ్లాదేశ్‌ జట్టు లో తమిమ్‌ ఇక్బాల్‌ సౌమ్య సర్కార్‌ షకిబ్‌ అల్‌ హసన్ ముష్పికర్‌ రహీమ్‌ మహ్మదుల్లా లిటన్‌ దాస్‌ మొసాదెక్‌ హుస్సేన్‌ మహ్మద్‌ సైఫుద్దీన్‌ మెహిదిహసన్‌ మష్రఫె మోర్తాజా(కెప్టెన్‌) ముస్తాఫిజర్‌ రహ్మాన్‌ లు ఉన్నారు.అయితే ఈ మ్యాచ్ లో పాక్ బంగ్లా జట్టుపై అనూహ్యమైన విజయాన్ని నమోదు చేస్తుందో లేదంటే చతికిల పడుతుందో మరి కొద్దీ సేపటిలో తెలిసిపోతుంది.