అల్లు అర్జున్ కారవాన్ ఇంటీరియర్ చూస్తే ఆశ్చర్యపోతారు ఖరీదు ఎంతో తెలుసా

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారవాన్ కారు కు సంబందించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.ఆ పిక్స్ లో అర్జున్ కారవాన్ ఇంటీరియర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 Tstop1 Allu Arjun Thankspeople Forfalcon-TeluguStop.com

అర్జున్ ఒక కారవాన్ తయారుచేయించు కున్నాడు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి గానీ ఎప్పుడూ కూడా ఈ వార్తల పై బన్నీ స్పందించలేదు.అయితే తాజాగా బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో పాల్కన్‌ కంపెనీకి చెందిన‌ కారవాన్‌ ఫోటోలు షేర్ చేయడం తో ఇప్పుడు ఆ వార్తలు వాస్తవమే అన్న విషయం అర్ధం అవుతుంది.ముంబైకి చెందిన వ్య‌క్తితో ప్ర‌త్యేకంగా మూడు కోట్లు పెట్టి ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్ చేయించాడ‌ని, ఈ కార్ వ్యాన్ ధ‌ర రూ.7 కోట్ల పై మాటే అని అంటున్నారు.అయితే ఇప్పుడు ఆ ఇంటీరియ‌ర్‌ని చూసి అభిమానులు అవాక్క‌వుతున్నారు.ముంబైకి చెందిన ప్ర‌ముఖ డిజైన‌ర్ అల్లు అర్జున్ టేస్ట్‌కి త‌గ్గ‌ట్టు ఇంటీరియ‌ర్‌ని డిజైన్ చేశార‌ని అంటున్నారు.

అల్లు అర్జున్ కారవాన్ ఇంటీరి�

అయితే త‌న కారవాన్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన బ‌న్నీ జీవితంలో పెద్ద స్ధాయిలో ఏది కొన్నా నా మ‌దిలో ఒక‌టే మెదులుతుంది.అభిమానులు నా పైన చూపించే ప్రేమ‌, ఆద‌ర‌ణ కారణంగానే ఇది సాధ్య‌మ‌వుతుంది.నా మీద ప్రేమ చూపిస్తున్న అందరికీ రుణపడి ఉంటాను.ఇది నా వ్యానిటీ వ్యాన్ అని బ‌న్నీ త‌న ట్వీట్‌లో తెలిపాడు.ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 19 వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube