జహీరాబాద్ డిపోను సందర్శించిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉన్న ఆర్ టి సి బస్ స్టాండ్ మరియు డిపోని పర్యటించిన టీఎస్ ఆర్ టి సి డైరెక్టర్ సజ్జనార్, జహీరాబాద్ డిపోకు రావడం జరిగింది.అనంతరం వారికి జహీరాబాద్ డిపో మేనేజర్ మరియు సిబ్బంది శాలువా మరియు బొకే ఇచ్చి సన్మానించారు.

 Tsrtc Md Sajjanar Visits Jaheerabad Rtc Depot Today Details, Tsrtc Md Sajjanar ,-TeluguStop.com

అనంతరం జహీరాబాద్ బస్ స్టాండ్ మరియు డిపో లో ఉన్న సమస్యలను డిపో మేనేజర్ రమేష్ ని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా సజ్జనార్ బస్టాండ్ లో బస్సుల గురించి వేచి చూస్తున్న ప్రయాణికులతో మాట్లాడి, బస్సులో ప్రయాణిస్తున్న వారిని కూడ సందర్శించిచడం, అదేవిధంగా జహీరాబాద్ బస్ స్టాండ్ లో ఉన్న వస్తువుల ట్రాన్స్పోర్ట్ కార్గో కొరియర్ ను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

డిపోలో కూడ పని చేస్తున్న కార్మిక, సిబ్బందికి వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.రానున్న రోజులల్లో అన్ని విధాలుగా సహకరించి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు అన్ని విధాలుగా సహకరించాలని, జహీరాబాద్ బస్ డిపో పరిధిలో ఉన్న వ్యాపార దుకాణలదారులు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ ధరలో వస్తువులు అమ్మకాలు చేస్తే వాళ్ళ పై కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు.

అనంతరం మీడియాతో టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాట్లాడుతూ.జహీరాబాద్ నుండి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ వెళ్లే బస్సుని అతి త్వరలో ప్రారంభిస్తామని, ప్రయాణికులు బస్సు లో ప్రయాణానికి సహకరించి, బస్సునీ శుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా ఏమన్నా సమస్యలు ఉంటే అతిత్వరలో దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తామని కోరారు.అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డివిజన్ డిపో మేనేజర్ సురేష్, జహీరాబాద్ డిపో మేనేజర్ రమేష్ మరియు ఆయా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tsrtc Md Sajjanar Visits Jaheerabad Rtc Depot Today Details, Tsrtc Md Sajjanar ,visits, Jaheerabad Rtc Depot , Tsrtc, Passangers, Tsrtc Buses, Sajjanar Jaheerabad Depot, Depot Manager Suresh - Telugu Depotmanager, Jaheerabadrtc, Passangers, Tsrtc, Tsrtc Buses

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube