అల్లు అర్జున్ కు షాక్.. అన్నీ ఆపేయాలంటూ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సజ్జనార్?

Tsrtc Md Sajjanar Tweet About Rapido Ad

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప.

 Tsrtc Md Sajjanar Tweet About Rapido Ad-TeluguStop.com

ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్లకు,సాంగులకు భారీగా స్పందన లభించింది.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

 Tsrtc Md Sajjanar Tweet About Rapido Ad-అల్లు అర్జున్ కు షాక్.. అన్నీ ఆపేయాలంటూ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సజ్జనార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ రెండు మూడు యాడ్ లలో నటించినట్లు తెలుస్తోంది.అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో యాడ్ బన్నీని చిక్కుల్లో పడేసింది.ఈ అడ్వటైజ్మెంట్ తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు ఇప్పటికే లీగల్ నోటీసులు అందాయి.దీనితో ఈ అడ్వర్టైజ్మెంట్ లో తెలంగాణ ఆర్టీసీ బస్సులను చూపించిన క్లిప్ ను తొలగించి యాడ్ ను ప్రచారం చేస్తోంది.

Telugu Allu Arjun, Alluarjun, Md Sajjanar, Pushpa, Rapido Add, Rapiod Ad, Tsrtc, Tweet-Movie

కాగా ఈ ప్రకటనను పూర్తిగా నిలిపి వేయాలని ఆదేశించింది లోకల్ కోర్టు.యూట్యూబ్ లో ఉన్న ఇందుకు సంబందించిన వీడియోలను కూడా రిమూవ్ చేయాలనీ సూచించింది.ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను ఉల్లంగిస్తే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు టీఎస్ఆర్టీసి ఎండి సజ్జనార్. కంపెనీలు తమ ప్రకటనలను రూపొందించే విధానంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఇతరుల పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అని తెలిపారు.

#Md Sajjanar #Arjun Rapido #Rapido #Allu Arjun #TSRTC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube