గుడ్ న్యూస్ : హైదరాబాద్ లో రోడ్డెక్కిన ఆర్టీసీ, కానీ...

కరోనా వైరస్ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్  విధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వ రవాణా సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అయినటువంటి టీఎస్ ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేసింది.

 Tsrtc, Telanagana, Road Transport, Hyderabad, Government, Employees Bus Facility-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు చేపడుతూ ఇందులో భాగంగా బస్సు సర్వీసులను యధావిధిగా నడపడానికి ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.అయితే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ జోన్ లో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మాత్రం బస్సులు నడపడానికి అనుమతులు ఇవ్వలేదు.

దీంతో తాజాగా ఈ విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే బస్సు సర్వీసులను ప్రారంభించింది.

దీంతో ఈ రోజు నుంచి ఆర్టీసీ సంస్థ అధికారులు బస్సు సర్వీసులను ప్రారంభించారు.అయితే హైదరాబాదు నగరంలో ఎంతోమంది ప్రైవేటు ఉద్యోగస్తులు పలు పరిశ్రమల్లో మరియు ప్రైవేటు సంస్థలు వంటి వాటిలో పని చేస్తున్నారు.

దీంతో కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది.కాబట్టి వీరికి కూడా రవాణా సౌకర్యం కల్పించాలని కొందరు ప్రజా సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు.అలాగే లాక్ డౌన్ కారణంగా పనులకు వెళ్లక ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం చేతనైనంత ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు.మరి ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నమోదయిన కరోనా వైరస్ పాజిటివ్ గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు దాదాపుగా 1,699 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 1035 మంది విజయవంతంగా కోలుకున్నారు.45 మంది మృత్యువాత పడ్డారు.దీంతో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ కోరలు చేస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube