ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘనుడు  

Tsrtc Bus Theft In Vikarabad - Telugu Crime News, Drunkard, General News, Tsrtc Bus, Vikarabad

మద్యం సేవించే వారు ఎలాంటి పనులు చేస్తారో వారికే తెలియదు.కాగా వారు చేసే పనులు ఒక్కోసారి మనకు నవ్వు తెప్పిస్తే, ఒక్కోసారి భయపెడతాయి.

Tsrtc Bus Theft In Vikarabad - Telugu Crime News, Drunkard, General News, Tsrtc Bus, Vikarabad-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఓ మందుబాబు చేసిన పనికి బస్సులో ప్రయాణిస్తున్న వారు తమ జీవితాలను అరచేతిలో పట్టుకున్నంత పనైంది.వికారాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

తాండూరు బస్టాండ్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఓ బస్సు ప్రయాణికులతో కిటకిటలాడింది.ఇంకా డ్రైవర్, కండక్టర్ రాకపోవడంతో ప్రయాణికులు వారికోసం ఎదురుచూడ సాగారు.కాగా ఇంతలో ఆ బస్సు డ్రైవర్ తన బస్సు కనబడటం లేదంటూ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు.ఫూటుగా మందేసిన ఓ వ్యక్తి తానే డ్రైవర్‌నంటూ ఆ బస్సును ఎత్తుకెళ్లాడు.

అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రయాణికులు అతడిని గట్టిగా నిలదీయడంతో నగర శివారులో బస్సును వదిలేసి పారిపోయాడు.

వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ప్రయాణికుల వద్ద ఆ తాగుబోతుకు సంబంధించిన వివరాలను సేకరించారు.

బస్సును డిపో మేనేజర్‌కు అప్పగించి కేసు నమోదు చేసుకున్నారు.

తాజా వార్తలు