ఏపీ మంత్రి కి తెలంగాణ మంత్రి వార్నింగ్.. ఆస్తులు ఇక్కడే ఉన్నాయట

ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య ఇప్పుడు జ‌ల వివాదం ఏ స్థాయిలో జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే.ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకునే దాకా వచ్చింది.

 Ts Minister Srinivas Goud Warning To Ap Ministers Over Krishna River Water Issue-TeluguStop.com

మొన్న‌టి వ‌ర‌కు కాస్త సైలెంట్‌గానే ఉంటున్న టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కృష్ణా న‌దిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డుతోంది.న్యాయ పోరాటానికి కూడా వెళ్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన కేసీఆర్‌.

ఇక మంత్రుల‌ను రంగంలోకి దింపి ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయిస్తున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు ఈ ప‌నిలో మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి కాస్త ముందు వ‌రుస‌లో ఉండ‌గా.

ఇప్పుడు తాను కూడా ఉన్నానంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రంగంలోకి దిగారు.ఏపీ వైసీపీ మంత్రులు నాని, వైసీపీ నేత రామ‌చంద్ర‌య్య చేసిన వ్యాఖ్య‌ల‌పై శ్రీనివాస్‌గౌడ్ విరుచుకుప‌డ్డారు.

వారిద్ద‌రూ అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని, ఎలా ప‌డితే అలా మాట్లాడితే స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు.తామెప్పుడూ తెలంగాణ కోస‌మే పోరాడుతామ‌ని, ఎవ‌రితో అయినా పోరాడుతామంటూ స్ప‌ష్టం చేశారు.

అంతే కా మంత్రి నాని, రామ‌చంద్ర‌య్య ఆస్తులు తెలంగాణ‌లోనే ఉన్నాయ‌ని చెప్పారు.అందుకోసం వారిద్ద‌రూ జాగ్ర‌త్త‌గా మాట్లాడితే బాగుటుంద‌ని వివ‌రించారు.

Telugu Ap Ycp, Kodali Nani, Krishna River, Ramachandrayya, Srinivas Goud, Ts, Ap

ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి మంత్రి, రామ‌చంద్ర‌య్య ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే ఆస్తుల‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని ఇన్ డైరెక్టుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్నింగ్ ఇస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.దీన్ని బ‌ట్టి చూస్తే కృష్ణా న‌ది నీళ్ల జ‌గ‌డం కాస్తా టీఆర్ ఎస్ , వైసీపీ మంత్రుల మ‌ధ్య పెద్ద దుమార‌మే రేపుతోంద‌ని తెలుస్తోంది.డైరెక్టుగా సీఎంలు మాత్రం ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కున్నా మంత్రుల‌తో మాట్లాడిస్తున్నారని స‌మాచారం.మ‌రి మంత్రులు ఇలా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, వార్నింగ్‌లు చేసుకోవ‌డం ఎంత వ‌రకు వెళ్తుందో అర్థం కావ‌ట్లేదు.

మ‌రి ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నాని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్య‌ల‌పై ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube