ఒక్కరోజులో ఫలితం తారుమారు.. నిన్న సున్నా మార్కులు నేడు 99 మార్కులు... ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వహకం...  

Telangana Intermediate Fake Results-ఇంటర్మీడియట్,తెలంగాణ

ఇటీవల తెలంగాణలో విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు గందరగోళం గా మారాయి. పరీక్షలలో ఫెయిల్ అయ్యమని కొంతమంది విద్యార్థులు మనస్తాపం తో చనిపోయారు. పైగా ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉత్థిర్ణత శాతం కూడా చాలా తగ్గింది..

ఒక్కరోజులో ఫలితం తారుమారు.. నిన్న సున్నా మార్కులు నేడు 99 మార్కులు... ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వహకం...-Telangana Intermediate Fake Results

అయితే చాలా మంది విద్యార్థులు వారి మార్కుల పట్ల అసంపూర్తి తో రివాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వహకం బయటపడింది. చాలా మంది విద్యార్థులకు తమ మునుపటి ఫలితాల కన్నా రివాల్యూయేషన్ చేసుకున్నాక మార్కులు కొంత పెరిగాయి.

ముందు సున్నా మార్కులు ఇప్పుడు 99 మార్కులు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెంకు చెందిన నవ్య ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసి మంచి మార్క్స్ వస్తాయన్న ధీమాతో ఉంది. మొదటి సంవత్సరం లో కామర్స్ భాగం లో డిస్ట్రిక్ టాపర్ అయిన నవ్య ఫలితాలు చూసుకుని ఒక్కసారిగా షాకైంది. తెలుగు సబ్జెక్టులో సున్నామార్కులు రావడంతో కన్నీరుమున్నీరైంది. ఈ విషయం ఆమె చదువుకున్న కళాశాల యాజమాన్యం కి తెలియడం తో తెలుగు పేపర్ కోసం రివాల్యూయేషన్ కోరారు.

దీంతో నవ్య ఆన్సర్ షీట్‌ను పరిశీలించిన బోర్డ్ అధికారులు ఆమెకు 99 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. దీంతో నవ్య మరొకసారి ఆమె టాపర్ గా నిలిచింది. దీనితో చాలా మంది విద్యార్థులు తమ మార్కుల పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ సారి పరీక్ష పత్రాల మూల్యాంకనం సరిగ్గా చేయలేదని అటు విద్యార్థుల తో పాటు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వచ్చే నెల 14 నుండి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.