తెలంగాణా నిరుద్యోగులకు మరో తీపి కబురు

తెలంగాణా పోలీసు శాఖలో తొందరలో 10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అవుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ చెప్పారు.రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది మరో తీపి కబురు.

 Ts Govt To Issue Notification For 10,000 Police Jobs-TeluguStop.com

పది వేల పోస్టుల్లో 9,200 కానిస్టేబుల్ పోస్టులు, మిగిలినవి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు.ముఖ్యమంత్రి కెసీఆర్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు.

ఈ పని దేశంలో ఎక్కడా చేయలేదన్నారు.ఇప్పటికే కొన్ని శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేసింది.

దీంతో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా అమ్ముతున్నారు.దిన పత్రికలూ ప్రత్యేక పేజీలు కేటాయించి సిలబసుకు సంబంధించిన మెటీరియల్ ప్రచురిస్తున్నాయి.

నిరుద్యోగులు వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారు.తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత కెసీఆర్ లక్ష ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారు.

అంటే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.కానీ ప్రభుత్వ శాఖల్లో అన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఎంతటి గొప్ప ముఖ్యమంత్రికి అయినా సాధ్యం కాదు.

ఇలాంటి నోటిఫికేషన్ల ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ పోవాలంటే చాలా ఏళ్ళు పడుతుంది.అందుకే ప్రయివేటు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడితే కొంతమందికి అయినా ఉద్యోగాలు వస్తాయి.మరో నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube