తెలంగాణలో ఉద్యోగాల జాతర

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత మొదటిసారిగా ఉద్యోగాల జాతర మొదలైంది.పదిహేనువేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జివో విడుదలైంది.

 Ts Govt Issues Go For Vacant Jobs-TeluguStop.com

దీనికి సంబంధించిన ఫైలుపై ఈమధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేసిన సంగతి తెలుసు.జిహెచ్ఎంసీ, వ్యవసాయం, సహకార శాఖ, పంచాయతీరాజ్‌, హోం శాఖ, విద్యుత్తు, పోలీసు, రెవన్యూ….

మొదలైన శాఖల్లో ఇక పోస్టులు భర్తీ చేయబోతున్నారు.ఈ పోస్టుల్లో కొన్నింటిని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేస్తే, మిగిలినవాటిని ఆయా శాఖలు భర్తీ చేస్తాయి.

ఈ ఉద్యోగాల కోసం వయో పరిమితిని పదేళ్ల పాటు సడలించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద మనసు చాటుకున్నారు.మొత్తం పదిహేనువేల ఐదొందల ఇరవైరెండు మందికి ఉద్యోగాలు దొరకబోతున్నాయి.

సంతోషం.అయితే లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్‌ చేసిన వాగ్దానం ముందు ఈ ఉద్యోగాలు చాలా తక్కువ.

సుమారుగా ఇంకా ఎనభైఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి.అవెప్పుడు చేస్తారో తెలియదు.

ఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏడాది సమయం తీసుకున్నారు.మరి ఎనభైఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఎన్నేళ్లు తీసుకుంటారు? ఏడాదికి పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఆయన దిగిపోయేలోపల పదిహేనువేలే అవుతాయి.అసలు ఏడాదికి పదిహేనువేల ఉద్యోగాలు భర్తీ చేయడం సాధ్యమా? ఒకవిధంగా చెప్పాలంటే ఇది కంటితుడుపే.కాని రేపు ప్రచారం మాత్రం భారీగా చేసుకుంటారు.

గోరంతను కొండంత చేయడం రాజకీయ నాయకులకు అలవాటే కదా….!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube