ఎట్టకేలకు ముగిసిన ఏపీ తెలంగాణ సరిహద్దు వివాదం.. అంబులెన్సులకు అనుమతి.. !

ఈ కష్ట కాలంలో స్వార్ధాన్ని కాస్త పక్కన పెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కర్తవ్యంగా వ్యవహరించ వలసిన విషయంలో నెలకొన్న అయోమయ పరిస్దితి, లేదా భయం వల్ల కావచ్చూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేసిన విషయం తెలిసిందే.ఏ రాష్ట్ర ప్రజలైన అందరికి సోకేది కరోనా వైరస్ అంతే కానీ మరేదో కాదు.

 Ts Govt Is Allowing Ap Ambulances At Borders Ts Govt, Allowed, Ap Ambulances, Su-TeluguStop.com

ఇలాంటి పరిస్దితుల్లో ఎంత మంది రోగులకైన చికిత్స సదుపాయం అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయినాయని మేధావి వర్గాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసందే.

అంతే కాకుండా ఈ అంశం పై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తి చేయడంతో అప్రమత్తమైన ప్రభుత్వం అంబులెన్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద ఇప్పటి వరకు అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తివేశారు.దీంతో తెలంగాణలోకి ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు ప్రవేశిస్తున్నాయి ఇక మొన్నటి వరకు కఠినంగా వ్యవహరించిన పోలీసులు ప్రస్తుతం మాత్రం ఎలాంటి పాసులు, అనుమతి పత్రాలు లేకపోయినప్పటికీ అంబులెన్సులను అనుమతిస్తుండడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube