హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో దశమహా విద్యాగణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ నేపథ్యంలో గణేశునికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలి పూజ చేయనున్నారు.
ఈ మేరకు రేపు ఉదయం 9.30 గంటలకు గణనాథుడికి తొలి పూజ నిర్వహించనున్నారు.పూజా కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసైతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొననున్నారని ఉత్సవ కమిటీ తెలిపింది.ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానాలు అందించిందని తెలుస్తోంది.
కాగా ఈ సారి పర్యావరణ హితంగా పూర్తిగా మట్టితో తయారు చేసిన మహా గణపతి 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.అయితే ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్థానం 1954వ సంవత్సరం నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.