పంచాయతీ సెక్రటరీల నియామకాలపై 'హైకోర్ట్' సీరియస్

తెలంగాణాలో ఇటీవల విడుదల చేసిన పంచాయతీ సెక్రటరీల నియామకాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది.జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో స్పోర్ట్స్‌, వికలాంగుల కోటాని విస్మరించడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.ఈ విషయంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.95 శాతం స్పోర్ట్స్‌, వికలాంగుల వాటా సరి చేసిన తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.పంచాయతీ సెక్రటరీ నియామకాలపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన వి​జ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

 Ts Government Sould Clarify Sports And Disability Quota Said High Court-TeluguStop.com

అంతే కాకుండా….ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై, 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలియజేస్తూ… పూర్తి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్‌ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు అనుమతి లేకుండా నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు సూచించి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube