తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు..!

కరోనా మహమ్మారి వల్ల దేశంలో అన్ని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేశారు.తెలంగాణాలో ఎంసెట్ 2021 ఆన్ లైన్ దరఖాస్తుల గడువుని కూడా మఓసారి పొడిగించారు.

 Ts Eamcet 2021 Application Process Extended Till 17th June 2021-TeluguStop.com

ఇప్పటికే వివిధ పోటీ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగిస్తూ వస్తుండగా తాజాగా తెలంగాణా ఎంసెట్ ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పొడిగించారు.దరఖాస్తులు చేసుకోవడానికి మరో వార రోజులు గడువు ఇచ్చారు.

ఈ నెల 17 వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని తెలుస్తుంది.అప్పటివరకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.

 Ts Eamcet 2021 Application Process Extended Till 17th June 2021-తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటివరకు 2,20,027 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.ఎంసెట్ ఇంజినీరింగ్ 1,46,541 ఫార్మాకు 73,486 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.పరీక్ష విధానం కూడా ఆన్ లైన్ ద్వారా జరిపే అవకాశం ఉంది.కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఈ పరీక్ష విధానంపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.

ఎంసెట్ పరీక్ష, కౌన్సెలింగ్ లాంటి విషయాల మీద డేట్స్ ప్రకటించాల్సి ఉంది.తెలంగాణాలోనే కాదు దేశ వ్యాప్తంగా అన్ని ఎంట్రన్స్ పరీక్షల గురించి విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు.

 కరోన తీవ్రత తగ్గితే మాత్రం వరుసగా ఈ పరీక్షల విధానం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎంసెట్ ఆన్ లైన్ దరాఖాస్తు చేసుకోని విద్యార్ధులకు పొడిగించిన ఈ దరఖాస్తు విధానాన్ని వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.

#Application #Process #Eamcet 2021 #TelanganaEamcet #17th June 2021

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు