మీ వాట్సాప్ చాటింగ్ సేఫ్ గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి..!

ప్రస్తుత రోజులలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ ప్రతి ఒక్కరు కూడా వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ మెసేజ్ యాప్ ను ఉపయోగిస్తూ అనేక మంది అనేక కార్యకలాపాలను, బిజినెస్ లు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

 Try This To Keep Your Whatsapp Chatting Safe, Whats App, New Features, Settings-TeluguStop.com

ఇది ఇలా ఉండగా ఈ యాప్ ఉపయోగించడం వల్ల ఒక ప్రమాదం కూడా ఉందని ఎవరికి తెలియదు.అది ఏమిటి అంటే.

కొంతమంది సైబర్ క్రైమ్ చేసే హాకర్లు ఎవరైనా చేసే చాటింగ్, షేర్ చేసిన ఫోటోలను కనిపెట్టేస్తున్నారు.అంతేకాకుండా కొన్ని అఫీషియల్ మీటింగ్స్ వివరాలను, అందుకు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా వేరొకరితో పంచుకుంటున్నారు.

అంతేకాకుండా ఎవరైనా సరే ముందుగా మీ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే సరే వారు వాట్సప్ ఓపెన్ చేసి మన సమాచారాన్ని దోచేస్తున్నారు.ఈ తరుణంలో సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ యాప్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

చాటింగ్ సీక్రెట్ గా ఉండాలి అంటే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం మంచిదనే సంస్థ పేర్కొంది.ప్రతి వాట్సాప్ చాటింగ్ మీడియా, ఇతర సమాచారంలో ఉంటాయని, మీ ప్రైవసీ సెట్టింగ్స్ లో మార్చుకునే అవకాశం ఉందని తెలుపుతున్నారు.

అది ఎలాగో చూద్దామా మరి.వాట్సాప్ లో టైప్ ఐడి లేదా ఫేస్ ఐడి లాక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది.ఈ ఆప్షన్ మీ వాట్సాప్ లో బ్లాక్ చేయడానికి సహాయపడుతుంది.ఇందులో వాట్సప్ సెట్టింగ్స్ లో సెట్టింగ్స్ లో ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది.

ఆప్షన్ ను ఎనేబుల్ చేస్తే మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా ఫింగర్ ప్రింట్ తప్పనిసరిగా అడుగుతుంది.దీనితో మీ డేటాను సేఫ్ గా పెట్టుకోవచ్చు.అలాగే వాట్సాప్ లో సెక్యూరిటీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను సెట్ చేసుకోవడానికి రైట్ సైడ్ పైన కనిపించే క్లిక్ చేసి ఆ తర్వాత సెట్టింగ్స్ లో అకౌంట్ పై క్లిక్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయాలి.వెరిఫికేషన్ ఆప్షన్ ఓపెన్ చేయగానే 6 అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

దీంతో మీ డేటాను చాలా సేఫ్ గా ఉంచుకోవచ్చు.మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్ లో ఇన్స్టాల్ చేసినపుడు ఖచ్చితంగా ఈ ఆరు అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా మీరు వేరే ఫోన్లో అయినా కానీ సేమ్ వాట్సప్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఈ పిన్ నెంబర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి.అంతేకాకుండా ఎవరైనా మీ వాట్సప్ యాప్ ను హ్యాక్ చేసినా కానీ వారు అయినా కచ్చితంగా ఈ నెంబర్ ఎంటర్ చేయాలి.

కనుక మీ అకౌంట్ సేఫ్ గా హ్యాక్ అవకుండా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ వాట్సాప్ లో ఈ సెట్టింగ్స్ మార్చుకుని మీ డేటాను భద్రపరుచుకోండి.

Telugu Cyber, Face Unlock, Privacy Policy, Privacy, Whats App-Latest News - Telu.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube