సాయి బాబా ఆలయంలోకి మోడ్రన్ దుస్తులు వేసుకొని వస్తే మాత్రం అనుమతించరు.మన సంప్రదాయం ప్రకారం మన దుస్తులను మాత్రమే ధరించాలని కోరారు.
స్పెషల్ డ్రెస్స్ కోడ్ అంటూ ఏమి పెట్టలేదని సాయి ఆలయ ట్రస్టు బోర్డు స్పష్టం చేసింది.గతంలో చాలా మంది చాలాసార్లు అసభ్యకరమైన దుస్తులు ధరించి రావడం జరిగింది.
పవిత్రమైన ఆలయంలోకి అలాంటి బట్టలు ధరించి అపవిత్రం చేస్తున్నారు.కావున ఆ విషయంపై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటునట్లుగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే తెలిపారు.
కరోనా కారణంగ మూత పడిన సాయి బాబా ఆలయాలు ఇపుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.కోవిడ్ నిబందనలు పాటిస్తూ ఆలయంలోకి గంటకు 900 మంది చొప్పున రోజుకు 6000 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తున్నాం.
కరోనా కారణంగ దర్శణానికి రాలేని భక్తులకు షిరిడీ ట్రస్ట్ ఆన్లైన్ లైవ్ దర్శనం ఏర్పాటు చేసింది.దర్శనం టిక్కెట్స్ మాత్రం ఆన్లైన్ లో తీసుకోవాలి.65 ఏండ్లు పైబడిన వారిని 10 ఏండ్ల పిల్లలకు అనుమతి లేదని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది.