కేరళలో పబ్లిసిటీ డ్రామాకు ముగింపు పలికిన తృప్తీ దేశాయ్‌

శబరిమల అయ్యప్పను దర్శించేందుకు ఆడవారు కూడా అర్హులే అంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో పూణెకు చెందిన భూమాత బ్రిగెడ్‌ నాయకురాలు తృప్తీ దేశాయ్‌ అయ్యప్పను దర్శించేందుకు శబరిమల వెళ్లింది.కాని అక్కడ ఆమె బృందంకు అయ్యప్ప భక్తులు ఎక్కడికక్కడ అడ్డు పడ్డారు.

 Trupthi Deshayi Pune-TeluguStop.com

ఆమెపై పెప్పర్‌ స్ప్రే చల్లారు.మొత్తంగా ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు.

దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.తన దర్శనంకు సహకరించాలంటూ పోలీసు కమీషనర్‌ను కోరగా వారు కూడా చేతులు ఎత్తేశారు.

పోలీసులు చేతులు ఎత్తేయడంతో చేసేది లేక తృప్తీ దేశాయ్‌ పూణె వెళ్లి పోతున్నట్లుగా ప్రకటించింది.సుప్రీం కోర్టు తీర్పును పోలీసులు అమలు చేయడంలో విఫలం అయ్యారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదనే విషయాన్ని గుర్తించాలంటూ ఆమె పేర్కొంది.తృప్తీ దేశాయ్‌ కేవలం పబ్లిసిటీ కోసమే శబరిమల వెళ్లిందని, ఆమెకు కావాల్సినంత పబ్లిసిటీ దక్కడంతో తిరిగి వెనక్కు వచ్చేస్తుంది అంటూ అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవుడిపై ఆమె చేస్తున్న పబ్లిసిటీకి ఆమెను జనాలు క్షమించరంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube