నాయకుడంటే ఇతనే కాబోలు... అసలు ఎం జరిగిందంటే...?!

గెలుపైనా, ఓటమైనా ఏదైనా సరే ఏ విషయంలో అయినా కూడా ప్రజల వెంట ఉండే నాయకుడే అసలు నాయకుడు.ప్రజల కష్టాలను వారి కష్టాలు గా భావించి ముందుకు సాగే వాడే అసలు సిసలైన నాయకుడు.

 He Is The Leader What Actually Happened Leader, Trunamul Congress, Coronavirus,-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇలాంటి నాయకులు దొరకడం చాలా అరుదు.అయితే కొన్ని సంఘటనలు చూస్తే… ఇలాంటి వారు ఇంకా కనుమరుగై పోలేదని అర్థమవుతుంది.

అయితే ఇక అసలు విషయంలోకి వెళితే…

ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ వల్ల ఎంతో మంది అభాగ్యులు సరైన సమయంలో ఆరోగ్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో.అలాంటి పరిస్థితి గురించి కానివ్వకుండా తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ యువ నాయకుడు తన పక్క ఊర్లో ఉండే వ్యక్తికి గత నాలుగు రోజుల నుండి జ్వరం రాగా, ఆపై అతనిని ఎవరు పట్టించుకోకపోవడంతో కరోనా లక్షణాలు ఉన్నాయేమో అన్న నేపథ్యంలో అతనిని తన స్కూటర్ పై ఎక్కించుకొని మరి హాస్పిటల్ లో చేర్పించాడు.

ఇకపోతే 43 సంవత్సరాలు ఉన్న అమల్ బారిక్ అనే వ్యక్తి కొన్ని రోజుల ముందు వేరే ప్రాంతం నుండి తన సొంతూరుకు చేరుకున్నాడు.అయితే తాజాగా అతనికి జ్వరం వచ్చింది.

ఆయన దురదృష్టం కొద్దీ అంబులెన్స్ కు ఫోన్ చేసిన అది రాకపోవడంతో… ఆయన ఇంట్లోనే జ్వరంతో విలవిల లాడాల్సి వచ్చింది.అయితే ఈ విషయం పక్క ఊరిలో ఉండే అధికార పార్టీ యువ నాయకుడు వెంటనే స్పందించి, ఆయన తెలిసిన వారి దగ్గర థానే స్వయంగా బైక్ తీసుకొని, ఆ తర్వాత మెడికల్ స్టోర్ వెళ్లి పీపీఈ కిట్ తానే స్వయంగా కొనుక్కొని, దానిని ధరించి ఆ తర్వాత అమల్ బారిక్ నివాసానికి వెళ్ళాడు.

ఆ తర్వాత అతడిని బండి మీద ఎక్కించుకుని నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రిలో అతన్ని చేర్పించాడు.అతన్ని తీసుకువెళ్ళింది కేవలం తక్కువ దూరం అయి ఉండొచ్చు కానీ, అంత సాహసించి చేయడం ఇప్పుడు ఆయన అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

ఇక ఆ యువ నాయకుడు పేరు సత్యకామ్ పట్నాయక్. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి యువ నాయకుడు గా పని చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube