అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను రోజు రోజుకి విమర్శలు చుట్టుముడుతున్నాయి.తన పదవి నుంచీ వైదొలగిన తరువాత ట్రంప్ ఇక సైలెంట్ అయ్యిపోతాడని అందరూ భావించారు.
కానీ ఊహించని విధంగా 2024 లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరుపున నేను బరిలో ఉంటానని ప్రకటించేసరికి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.తనకంటూ ఓ కార్యాలయం, సొంత సోషల్ మీడియా, సొంత వెబ్సైటు ఇలా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి ట్రంప్ అన్ని విధాలుగా సిద్దమవుతున్నారు.అయితే
ట్రంప్ దూకుడుకి ఆయన గతం కళ్ళెం వేస్తోంది.గడించిన కొంత కాలంగా లైంఘిక ఆరోపణలు వెంటాడితే తాజాగా ఆయనపై అప్పు ఎగ్గొట్టిన గతం తాలుకూ కధనం పరువు తీస్తోంది.అది కూడా ట్రంప్ తన బాడీ గార్డ్ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.2008 లో ట్రంప్ తన వద్ద సుమారు 130 డాలర్లు అంటే రూ.9500 అప్పుగా తీసుకున్నారని ఆ డబ్బు ఇప్పటికి తిరిగి ఇవ్వలేదని ట్రంప్ బాడీ గార్డ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఓ ప్రముఖ వార్తా ఛానల్ తో తన గతాన్ని పంచుకున్న ట్రంప్ మాజీ బాడీ గార్డ్ కెవిన్ స్కాట్ ల్యాండ్ లోని అబర్దీన్ విమానాశ్రయం లో బర్గర్ కొనుక్కోవాలి అనుకున్నారు.అయితే ఈ సమయంలో ట్రంప్ వద్ద యూకే కరెన్సీ లేకపోవడంతో తన వద్ద రూ.9500 అప్పుగా తీసుకుని బర్గర్ కొనుకున్నారని, తనతో పాటు ఆయనతో పాటు ఉన్న అందరికి బర్గర్ కొని ఇచ్చారని అన్నారు.ఇది జరిగి నాలుగేళ్ళు అవుతున్నా ఇప్పటికి ట్రంప్ తన భాకీ తీర్చలేదని కాగా తనను ఉద్యోగం నుంచీ తొలగించారని కెవిన్ ఆరోపించారు.ట్రంప్ చాలా మంచి వారు అనుకున్నా అప్పు ఇలా ఎగ్గొడుతారని అనుకోలేదని అన్నారు.
ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.