కొత్త సర్వే: ట్రంప్‌కు ఆ ఏడు రాష్ట్రాల్లో వ్యతిరేక పవనాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.ఇందుకు సంబంధించి ఏదో ఒక సర్వే వెలుగులోకి వస్తూనే ఉంది.

 Trump Would Face Competitive Races With Biden-TeluguStop.com

తాజాగా ట్రంప్ 2016లో గెలిచిన ఏడు రాష్ట్రాల్లో మూడు చోట్ల డెమొక్రాట్ల నుంచి గట్టిపోటి ఎదుర్కోవాల్సి వస్తుందని కొత్త సర్వే చెబుతోంది.న్యూయార్క్ టైమ్స్ మరియు సియానా కాలేజీలు సంయుక్తంగా మిచిగాన్, అరిజోనా, ఫ్లోరిడా, అయోవా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ మరియు పెన్సిల్వేనియా – రాష్ట్రాలలో నమోదైన ఓటర్లతో సర్వే నిర్వహించాయి.

వీటిలో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడిన్ ఆరిజోనా రాష్ట్రంలో ట్రంప్ కంటే ఎక్కువ ఆధిక్యంలో ఉన్నట్లు సర్వే తెలిపింది.బెర్నీ సాండర్స్, సెనేటర్ ఎలిజబెత్ వారెన్ అయోవాలో పోటాపోటీగా ఉన్నారు.

మిచిగాన్‌లో మాత్రం అధ్యక్షుడిదే ఆధిక్యత.సార్వత్రిక ఎన్నికలకు ఒక ఏడాది మాత్రమే సమయం ఉంది.

దేశవ్యాప్తంగా నమోదైన ఓటర్లలో ట్రంప్‌పై బిడెన్, వారెన్, సాండర్స్ ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే 2016లో ఏమాత్రం ప్రజాదరణ లేకపోయినప్పటికీ ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతిని విశ్లేషకులు ఇక్కడ గుర్తుచేస్తున్నారు.

Telugu American, Telugu Nri Ups, Trump-

ఆ సమయంలో కొత్తగా ఎన్నికల్లో చేర్చబడిన రాష్ట్రాల్లో విజయాల కారణంగానే ట్రంప్ అనూహ్యంగా గెలుపొందారు.ఇక కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, మిచిగాన్, అయోవాలలో వారెన్ కంటే బిడెన్ చాలా ముందున్నారు.ఫ్లోరిడాలో బిడెన్‌కు 46 శాతం మంది ప్రజలు మద్ధతు పలకగా.మిచిగాన్‌లో బిడెన్‌కు 44 శాతం మంది మద్ధతు ఉంటే.వారెన్‌కు 39 శాతం మద్ధతు ఉంది.అయోవాలో బిడెన్‌కు 44 శాతం మంది మద్ధతు పలకగా.

వారెన్‌కు 40 శాతం మంది అండగా నిలిచారు.అన్ని సర్వేల్లోనూ ట్రంప్‌కు జనం వ్యతిరేకంగానే నిలిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఏడు రాష్ట్రాల్లో ట్రంప్‌కు 40 శాతం మంది మద్ధతు పలకగా… డెమొక్రాట్లకు 46 శాతం మంది సై అంటున్నారు.అరిజోనా, ఫ్లోరిడా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా మరియు విస్కాన్సిన్లలో అక్టోబర్ 13 నుంచి 26 వరకు… అయోవాలో అక్టోబర్ 25 నుంచి 30 మధ్యలో ఈ సర్వే నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube