ట్రంప్ ఆ పని చేయకుంటే...మృతుల సంఖ్య 20లక్షలకి చేరుకునేదట...!!!

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 4 వేలు దాటింది.మరో పక్క పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా రోజుకో రకంగా సుమారు 2 లక్షలకి పైగానే నమోదు అయ్యాయి.

 Immigrants, Trump, Corona, White House, Donald Trump Policy, Coronavirus-TeluguStop.com

అంతేకాదు అమెరికాలో కేవలం ఒక్క న్యూయార్క్ నగరంలో ఈ కరోనా హవా పూర్తి స్థాయిలో ఉండటంతో మరణాల సంఖ్య 1550 కి చేరుకుంది.అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన విషాదకరమైన 9/11 నాటి దాడులని మించి కరోనా మృతుల సంఖ్య నమోదు అవుతోంది.

జాన్ హాప్కిన్స్ వర్సిటీలో పరిశోధకుల లెక్కల ప్రకారం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 3 లక్షలకి చేరువ అయ్యేలా ఉందని అంటున్నారు.ఇప్పటికే చైనాని దాటేసినా అమెరికా త్వరలో మృతుల సంఖ్యలో సైతం ముందు నిలిచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

అయితే ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన అమెరికా వ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది ప్రజలు మృత్యువు నుంచీ తప్పించుకున్నారని తెలిపారు.

Telugu Corona, Coronavirus, Donaldtrump, Trump, White-

అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తున్న వలస వాసులని కట్టడి చేయడంతో ట్రంప్ నిజంగానే విజయాన్ని సాధించారు.ఈ క్రమంలోనే అమెరికా సరిహద్దులలో ఎత్తైన గోడని నిర్మించారు.అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలస వాసులని తిప్పి వెనక్కి పంపిచేశారు.

ఇలా వెళ్ళిపోయినా వలసవాసుల సంఖ్య దాదాపు 22 లక్షలని అమెరికా వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి.ఒక వేళ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే అమెరికాలో మరణాలు 15 నుంచీ 20 లక్షల వరకూ ఉండేవని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube