అమ్మ ట్రంపూ...భారతీయులకు ఇంత దెబ్బెశావా...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో విమర్శనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.అందులో ప్రధానంగా వలస వాసులను నిరోధించే క్రమంలో ట్రంప్ తీసుకున్న చర్యలు ట్రంప్ ప్రతిష్టకు భంగం కలిగించాయి, అంతేకాకుండా ఎంతో మంది వలస వాసులకు వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నాడు.

 Trump What A Blow To Indians-TeluguStop.com

ఈ పరిణామాలు ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం చూపించాయి.ఇదిలాఉంటే ట్రంప్ వలసలు నిరోధించే క్రమంలో చేపట్టిన చర్యల కారణంగా ఎంతో మంది ఎన్నో సమస్యలు ఎడుర్కున్నారట, ముఖ్యంగా భారతీయులు పడరాని పాట్లు పడ్డారని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ లెక్కలు వేసి మరీ చెప్పింది.

నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసి తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే అమెరికా రావాలని కలలు గన్న ఎంతోమంది భారతీయులు అందుకోసం హెచ్-1బి వీసాలను ఆధారంగా చేసుకుని వస్తూ ఉంటారు.అయితే ట్రంప్ హయాంలో హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో అత్యధికంగా దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని వెల్లడించింది నేషనల్ ఫౌండేషన్.2020 ద్వితియార్ధంలో దాదాపు 28.6 శాతం హెచ్-1బి వీసాలు తిరస్కరించారని, అప్పట్లో 38,500 దరఖాస్తులు రాగా సుమారు 15,500 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని నేషనల్ ఫౌండేషన్ తెలిపింది.

 Trump What A Blow To Indians-అమ్మ ట్రంపూ…భారతీయులకు ఇంత దెబ్బెశావా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే వీసాల దరఖాస్తుల విషయంలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం, పలు రకాల నిభందనలు విధించారు.అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ట్రంప్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి.ఇక 2021 ద్వితియార్ధంలో కేవలం 7.1 శాతం పిటిషన్లు మాత్రమే తిరస్కరించబడ్డాయని ప్రతీ ఏడాది ఇచ్చే హెచ్-1బి వీసాలలో దాదాపు 70 శాతం భారతీయులనే వరిస్తున్నాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసి వెల్లడించింది.

#Donald Trump #Visa #Indians #Federal

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు