మరోసారి ఇరాన్ పై బెదిరింపులకు దిగుతున్న ట్రంప్...వంతపాడుతున్న సౌదీ  

Trump Warns Iran Not To Threaten U.s.-nri,telugu Nri News Updates,trump,trump Warns Iran

ఇరాన్ యుద్దాన్ని కోరుకుంటే ఇక ఆ దేశం నాశనం అయినట్లే అని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. అయితే అమెరికా తో ఇప్పుడు సౌదీ అరేబియా కూడా తందాన అంటుంది. తమ దేశ ప్రయోజనాల పై ఇరాన్ దాడి చేస్తే దానికి అదే చివరి రోజు అవుతుంది అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు..

మరోసారి ఇరాన్ పై బెదిరింపులకు దిగుతున్న ట్రంప్...వంతపాడుతున్న సౌదీ -Trump Warns Iran Not To Threaten U.S.

మరోవైపు సౌదీ కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ సౌదీ కూడా వంత పాడుతుంది.

దీనితో ఇరాన్ ఘాటుగా స్పందిస్తూ బెదిరించడానికి ప్రయత్నించడం మాని,గౌరవించడం నేర్చుకోండి అంటూ ఇరు దేశాలను హెచ్చరించింది. ఇరాన్ ను భయపెట్టాలి అని చూస్తున్న నేతలు ఒకసారి చరిత్ర తిరగేస్తే పరిస్థితి అర్ధం అవుతుంది.

గతంలో అలెగ్జాండర్‌, చెంఘిజ్‌ ఖాన్‌ వంటి నియంతలు ఇలాగే విర్రవీగి చివరికి మట్టికరిచారని ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావెద్‌ జరీఫ్‌ పేర్కొన్నారు. అంతకుముందు ట్రంప్‌ ఓ ట్వీట్‌ చేస్తూ, ‘ఇరాన్‌ యుద్ధం కోరుకుంటే అదే దానికి చివరి రోజవుతుంది. మరోసారి ఎప్పుడూ అమెరికాను హెచ్చరించొద్దు’ అని బెదిరించారు..

యుద్ధ పరిస్థితే వస్తే తాము పూర్తి బలాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని, యుద్ధ నివారణ ఇరాన్‌ చేతుల్లోనే వుందని సౌదీ అరేబియా కూడా బెదిరించింది. అమెరికా తన నౌకాదళానికి చెందిన యుద్ధ విమాన వాహకనౌకను, బి-32 తరహా బాంబర్‌ విమానాలను గల్ఫ్‌ ప్రాంతంలో మోహరించటంతో ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే, 2015 లో జరిగిన అణు ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చింది. ఆ ఒప్పందంలో లోపాలు ఉన్నాయంటూ ట్రంప్ ఆ ఒప్పందం నుంచి వైదొలగడం, ఇరాన్ కూడా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా వారం క్రితం అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం తో కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది.