ట్రంప్ వార్నింగ్..సరిహద్దు మూసేస్తా..!!!  

Trump Warning That He Will Close The Border-close,illegal Entry,one Week,telugu Nri Updates,trump,wall,warning

అమెరికా సరిహద్దు గోడ నిర్మాణం విషయంలో ట్రంప్ ఒక అడుగు కూడా వెనక్కి వేస్తేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ గోడ నిర్మాణ విషయంలో ఈ నెల రోజుల పాటు అమెరికా స్తంభించిపోయిన పట్టువదలని ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు తాను కోరిన రీతిలో అమెరికన్ కాంగ్రెస్ చట్టాన్ని ఆమోదించని పక్షంలో సరిహద్దులో అతి పెద్ద భూభాగాన్ని మూసివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు.

ట్రంప్ వార్నింగ్..సరిహద్దు మూసేస్తా..!!!-Trump Warning That He Will Close The Border

గురువారం రోజున వైట్ హౌస్ లో మాట్లాడుతూ సరిహద్దు గోడ నిర్మాణం పై కాంగ్రెస్ తనతో ఒక అవగాహనకు రాకుంటే సరిహద్దులను ఒక వారం లోపలే మూసివేస్తామని, ఇది హెచ్చరిక కాదని వాస్తవ పరిస్థితిని చెబుతున్నానని అన్నారు.

అయితే సరిహద్దులు మూసివేస్తే ఆ ప్రభావం వాణిజ్యంపై పడుతుంది కదా అని విలేఖరి అడగడంతో వాణిజ్యం కంటే కూడా రక్షణ ఎంతో ముఖ్యం అంటూ బదులిచ్చారు ట్రంప్.

అయితే సరిహద్దు గోడ విషయంలో తామెంతో పట్టుదలగా ఉన్నామని ఒకవేళ సరిహద్దు మూసివేసినా వాణిజ్య పరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని అమెరికా మెక్సికో ల మధ్య రాకపోకలు సరుకుల రవాణా నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పారు