'షట్ డౌన్'...దిశగా అమెరికా...!!!

అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో షట్ డౌన్ నమోదయిన విషయం అందరికి తెలిసిందే.అయితే మళ్ళీ ఇప్పుడు సరిహద్దు హోదాపై ఏకాభిప్రాయం ఇప్పటికే లేకపోవడంతో మళ్ళీ షట్ డౌన్ తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 Trump Want To Continue Shutdown In America-TeluguStop.com

యూఎస్ కాంగ్రెస్ లో ఈ గోడ నిర్మాణానికి సంభందించి బిల్లు పాస్ చేసుకునే అవకాసం ఈ నెల 15 వరకూ మాత్రమే సమయం ఉండగా.ఇప్పటి వరకూ డెమోక్రాట్లకి , ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగక పోవడం గమనార్హం.

సెనెట్‌, ప్రతినిధుల సభల నుంచీ ఇరు పర్తీలక్కు చెందినా సుమారు 17 మంది సభ్యులు సరిహద్దు రక్షణ బిల్లుని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే చర్చలు సరిగా జరుగకుండా డెమోక్రాట్లు అడ్డుకున్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.వలసదార్లను నిర్బంధించే కేంద్రాల్లో పడకల సంఖ్యను 16,500 కు పరిమితం చేయాలని డెమోక్రాట్లు కోరుతున్నారు.

ఒక వేళ ఇదే గనుకా జరిగితే ఐసీఈ అంతకంటే ఎక్కవ మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉండదు.దాంతో నేర చరిత్ర ఉన్నవారినే అదుపులోకి తీసుకోవడానికి అధిక ప్రాధాన్యతని ఇవ్వాల్సి ఉంటుంది.ఇదిలాఉంటే గోడ నిర్మాణానికి అధ్యక్షుడు ట్రంప్‌ 5.7బిలియన్‌ డాలర్లు అవసరమని కోరగా దానికి కాంగ్రెస్ మాత్రం 1.3 బిలియన్‌ డాలర్ల నుంచి 2 బిలియన్‌ డాలర్ల వ్యయాన్ని మాత్రమె ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతోందని.మరి చర్చలు సాపీగా సాగుతాయా షట్ డౌన్ దిశగా వెళ్తాయా అనేది త్వరలో తేలుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube