ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించిన ట్రంప్...సోదాలో కీలక పత్రాలు లభ్యం...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వివాదాస్పద నిర్నయాలు తీసుకోవడమే కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ప్రతీ విషయంలో వార్తల్లో వ్యక్తిగానే నిలిచేవారు.అప్పట్లో ఆయన చేసిన తప్పులు, వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఏకు మేకై ట్రంప్ కు గుచ్చుకుంటున్నాయి.

 Trump Violated Federal Laws Key Documents Found In Search ,  Trump , Former Us-TeluguStop.com

ఇప్పటికే క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో చేతులు కాల్చుకున్న ట్రంప్ తాజాగా మరో అంశం లో అడ్డంగా బుక్కయ్యారని తెలుస్తోంది.అమెరికా అధ్యక్షుడికి పరిధిలో ఉండే కీలక పత్రాలను ట్రంప్ చెత్త కాగితాలుగా మార్చేశారని, అత్యంత రహస్యమైన డాక్యుమెంట్స్ ను ట్రంప్ తన ఇంటికి పట్టుకు వెళ్ళడమే కాకుండా తన ఇంటిలో ఉండే మ్యాగ్జైన్స్ లో కలిపేశారని తెలుస్తోంది.

ఫెడరల్ చట్టాలను ట్రంప్ పూర్తిగా తుంగలో తొక్కారని ట్రంప్ పై ఫెడరల్ బ్యూరో అధికారులు మండిపడుతున్నారు.గతంలో అధికారులు ట్రంప్ ఇంటికి వెళ్ళిన సమయంలో అక్కడి నుంచీ 15 బాక్స్ లను స్వాధీనం చేసుకోగా వాటిలో సుమారు 14 బాక్స్ లలో క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని వీటిలో అత్యంత రహస్యమైన పత్రాలను ట్రంప్ ఆయన మ్యాగజైన్ లలో కలిపారని, వాటితో పాటు ఆయన వ్యక్తిగత పత్రాలు సైతం వాటిలో కలిపేసారని బ్యూరో అధికారి ఒకరు వెల్లడించారు.

ట్రంప్ చేసిన ఈ చర్యలు చట్ట వ్యతిరేకమని, వైట్ హౌస్ నుంచీ ఎలాంటి రహస్య పత్రాలు ఇంటికి తీసుకువెళ్ల కూడదనే నియమం ఉందని, కానీ ట్రంప్ అలా చేయలేదని అన్నారు.అప్పటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు అధికారులు.

ఇదిలాఉంటే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ట్రంప్ కి తాజా పరిస్థితులు మోకాలడ్డేల ఉన్నాయని అంటున్నారు నిపుణులు.కాగా తన నివాసానికి వచ్చి తనకు సంభందించిన వ్యక్తిగత పత్రాలను స్వాధీనం చేసుకోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా ట్రంప్ కొట్టిపారేశారు.

ఇదిలాఉంటే ట్రంప్ లాయర్ మీడియాతో మాట్లాడుతూ డాక్యుమెంట్స్ ను క్లాసిఫైడ్ చేసే హక్కు తమ క్లైంట్ కు ఉంటుందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube