జపాన్ లో పర్యటిస్తున్న ట్రంప్....ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యం తో ట్రంప్ నాలుగు రోజుల పాటు జపాన్ లో పర్యటించనున్నారు.

 Trump Traveling In Japan Bilateral Agreements Between The Two Countries-TeluguStop.com

ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ జపాన్ తో మెరుగైన వాణిజ్య సంబంధాలు సాగిస్తామని తెలిపారు.ఈ ఒప్పందం నిస్పాక్షికంగా ఉందని, ఈ ఒప్పందంతో వాణిజ్య అసమతౌల్యానికి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని, అమెరికా ఎగుమతులకు ఉన్న అడ్డంకులు తొలగుతాయని, ఇరుదేశాల సంబంధాల్లో నిష్పాక్షికత, పరస్పర సహకారం ఒనగూరుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ పర్యటనలో భాగంగా ట్రంప్‌ సోమవారం జపాన్‌ కొత్త చక్రవర్తి నరుహిటోతో కూడా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలానే మరికొన్ని కార్యక్రమాల్లో కూడా ట్రంప్ పాల్గొనననున్నట్లు సమాచారం.

ఆదివారం సుమో టోర్నమెంట్‌కు హాజరై విజేతకు ట్రోఫీ బహూకరించడం, దానికంటే ముందు ట్రంప్‌, అబె గోల్ఫ్‌ ఆడనున్నట్లు తెలుస్తుంది.అలానే కుటుంబం తో కూడా కాసేపు గడపనున్నారు.

భార్యలతో కలిసి రెస్టారెంట్‌కూ కూడా వెళ్లి విందు ఆరగించనున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ట్రంప్ హాలిడే ట్రిప్ కోసం జపాన్ వెళ్లినట్లు తెలుస్తుంది.

సోమవారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం, అలానే విందు కార్యక్రమాలు కూడా ఉన్నాయి.అవన్నీ ముగిసిన తరువాత ఇద్దరు నేతలూ మీడియాతో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళిక పై మాట్లాడనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube