హంజా చాలా ప్రమాదకారి,స్పందించిన ట్రంప్!

అగ్రరాజ్యం అమెరికా కు నిద్ర లేకుండా చేసిన ఒసామా బిన్ లాడెన్ పదిహేనో కుమారుడు హంజా లాడెన్ మృతి చెందినట్లు అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయం పై అమెరికా ప్రభుత్వం కానీ,అధ్యక్షుడు ట్రంప్ కానీ స్పందించలేదు.

 Trump Toldhamza Is Verydangerous-TeluguStop.com

అయితే తాజాగా వైట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో ట్రంప్ దీనిపై స్పందించారు.హంజా చాలా ప్రమాదకర వ్యక్తి అని, అతడు ఏకంగా అమెరికానే టార్గెట్ చేస్తూ సర్వనాశనం చేస్తాను అంటూ బెదిరించాడని అన్నారు.

అయితే అతడు చనిపోయిన విషయాన్ని మాత్రం ఆయన ధ్రువీకరించలేదు కానీ,హంజా మాత్రం చాలా ప్రమాదకారి అంటూ వ్యాఖ్యానించారు ట్రంప్.హంజా లాడెన్ ఆచూకీ చెబితే ప‌దిల‌క్ష‌ల డాల‌ర్లు ఇస్తామ‌ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అమెరికా ప్ర‌భుత్వం ఓ ప్ర‌కటన చేసింది.

హంజాకు 30 ఏళ్ల వ‌య‌సు ఉంటుంద‌ని అనుమానాలు కూడా ఉన్నాయి.అల్ ఖైదా లీడర్ గా హంజా ని ప్రకటించిన తరువాత అమెరికా పై నేరుగా హెచ్చరికలు జారీ చెసాడు.

దీనిని సీరియస్ గా తీసుకున్న అమెరికా హంజా ని వేటాడే పనిలో పడింది.ఈ క్రమంలోనే రివార్డు ను ప్రకటించింది.

అయితే అమెరికాతో పాటు ఇత‌ర దేశాల‌పైన దాడులు చేయాలంటూ ఆడియోలు, వీడియోలను హంజా రిలీజ్ చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.హంజా హ‌త‌మైన‌ట్లు ఎన్‌బీసీ, న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ‌లు వెల్ల‌డించాయి.

ఇంటెలిజెన్స్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం హంజా మృతి చెందాడని వార్తా సంస్థలు తెలిపాయి కానీ అసలు ఎప్పుడు ఎక్కడ హంజా ని హతమార్చారు అన్న విషయాన్నీ మాత్రం వెల్లడించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube