ఇంగ్లీష్ వస్తేనే అమెరికా రండి..ట్రంప్..

అమెరికా వెళ్లాలని అనుకునే వలసదారులు ఎవరైనా సరే ఇంగ్లీష్ మాట్లాడటం పూర్తిగా వస్తేనే, ఆ బాషలో నిష్ణాతులు అయితేనే అడుగుపెట్టాలని ట్రంప్ తేల్చి చెప్పారు.ఇంగ్లీష్ బాషాపై పట్టులేని వారు మాత్రం అమెరికా ఆలోచన మానుకోవడం మంచిదని హితవు పలికారు.

 Trump To Propose Merit Based Immigration System-TeluguStop.com

అంతేకాదు ఆ బాషతో పాటు అమెరికా చరిత్ర, అక్కడి సమాజం గురించి కనీస అవగాహన ఉండాలని, ప్రాధమిక విషయాలు తెలియకుండా అమెరికా రావద్దని కూడా హితవు పలికారు ట్రంప్.

అమెరికా వలస విధానాన్ని నేను పూర్తిగా మార్చబోతున్నాను అందుకు అమెరికా ప్రజలు, వలసదారులు సహకరించాలని.

మార్పులో భాగంగా కొత్త రూపు ఇస్తున్న సంస్కరణల ప్రతిపాదనల్లో అందరూ సహకరించాలని కోరారు.నూతన విధాన అంశాలని కొత్త విధానంలో పొందుపరిచినట్టుగా ట్రంప్ తెలిపారు.అంతేకాదు వలస వచ్చే అభ్యర్ధులు దరఖాస్తుకు ముందు సివిక్స్ పరీక్షలో విజయం సాధించి తీరాలని అన్నారు.

ఇంగ్లీష్ వస్తేనే అమెరికా రండ�

అదేవిధంగా స్కిల్డ్ వర్కర్ల కోటా పెరిగేలా సరికొత్త ప్రతిపాదనలు రూపొందిచారు.అత్యంత నైపుణ్యం కలిగిన వర్కర్ల వలసను 12 నుంచి 57 శాతానికి పెంచడం తాము చేస్తున్న పెద్ద మార్పు అని ట్రంప్ తెలిపారు.ఈ కోటాను కూడా పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని, వీరంతా తమ టాలెంట్ ఆధారంగానే అమెరికాలో అడుగు పెట్టాల్సి ఉంటుందని ట్రంప్ వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube