భారతీయ విద్యార్ధులకు శుభవార్త: కాల పరిమితి గల స్టూడెంట్ వీసా విధానం దిశగా ట్రంప్

అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించి, మంచి ఉద్యోగం సంపాదించాలని భారతీయులతో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత కల.అయితే అక్కడి వీసా నిబంధనలు, ఇతర చట్టసంబంధమైన అంశాలు విద్యార్ధులకు ప్రతిబంధకంగా మారాయి.

 Trump Administration Steps Closer To Adopting A Time-bound Visa System, Donald T-TeluguStop.com

ఈ నేపధ్యంలో స్టూడెంట్ వీసాలకు సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని ఫెడరల్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ కొత్త విధానం ప్రకారం విదేశీ విద్యార్ధులు అమెరికా నుంచి ఎప్పుడు, ఏ సమయంలో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాలనే దానిని స్పష్టంగా సూచిస్తుంది.

దీని వల్ల విదేశీ విద్యార్ధులు చట్ట పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన ముప్పు తప్పుతుంది.దీనికి సంబంధించిన ప్రతిపాదనను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) జూన్ 3న ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ)కి అందజేసింది.

ఓఎంబీ యొక్క సమీక్ష, నిబంధనల తయారీ ప్రక్రియలో భాగంగా ప్రతిపాదనను ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురిస్తారు.దీనిని అమలు చేయడానికి ముందు ప్రజాభిప్రాయాలను సేకరించి తదనుగుణంగా నిబంధనల్లో మార్పు చేస్తారు.

Telugu Donald Trump, Trumpcloser, Visa System-

కాగా హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా వెలువరించిన ‘‘ ఓవర్ స్టే రిపోర్ట్’’ ప్రకారం… సెప్టెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో తమ అధ్యయనాలను పూర్తి చేసిన మొత్తం 19.49 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్ధుల్లో 60,000 మంది ఇంకా అమెరికాను వీడలేదు.ఇక భారతీయ విద్యార్ధుల విషయానికి వస్తే.ఈ తేదీ నాటికి 1.59 లక్షల మంది అమెరికాను వీడి స్వదేశానికి వెళ్లాల్సి వుంది.వీరిలో 5,304 మంది లేదా 3.32 శాతం మంది గడువు తీరినా అగ్రరాజ్యంలోనే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube